అసోంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్దరణ

గురువారం సాయంత్రం నుంచి అసోంలో మెబైల్ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్దరించాలంటూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలనంటూ అసోం ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను శుక్రవారం(డిసెంబర్-20,2019)గౌహతి హైకోర్టు కొట్టివేసింది. గురువారం సాయంత్రం 5గంటల నుంచి ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్దరించాలంటూ హైకోర్టు ఆదేశించినప్పటికీ దాన్ని అమలుచేయాలని ప్రభుత్వం మొబైల్ ఆపరేటర్లకు ఎలాంటి సూచనలు చేయలేదన్న విషయం తెలిసిందే.
శుక్రవారం(డిసెంబర్-20,2019)ఉదయం నుంచి మొబైల్ ఇంటర్నెట్ సర్వీసలు అసోంలో పునరుద్దరించబడ్డాయి. పౌరసత్వసవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో సోషల్ మీడియా దుర్వినియోగం చేయనీయకుండా ముందుజాగ్రత్తగా ఇంటర్నెట్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 10 రోజుల తర్వాత సేవలు మళ్లీ పునరుద్దరించబడ్డాయి.
పౌరసత్వ సవరణ చట్టం,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనాసాగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. పలుచోట్ల ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను తగులబెడుతున్నారు. పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకునేంతవరకు తాము ఆందోళనలు ఆపేదే లేదని ఆందోళనకారులు చెబుతున్నారు.