గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితులకు బెయిల్.. వారికి ఘనస్వాగతం పలికిన వైనం
వారిద్దరినీ ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు తీసుకెళ్లి, పూలమాల వేశారు. ఆ తర్వాత కాళికామాత ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు బెయిల్‌పై విడుదల కావడంతో వారిద్దరికీ కర్ణాటకలోని పలు హిందూ సంఘాలు ఘనస్వాగతం పలికాయి. గౌరీ లంకేశ్‌ను 2017 సెప్టెంబరు 5న బెంగళూరులో తుపాకితో కాల్చి హత్య చేసిన ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ కేసులో ఆరు సంవత్సరాలు జైలు జీవితం గడిపిన పరశురాం వాఘ్‌మోర్‌తో పాటు మనోహర్ యాదవ్‌కు బెంగళూరు సెషన్స్ కోర్టు అక్టోబర్ 9న బెయిల్ మంజూరు చేసింది. దీంతో అక్టోబర్ 11న పరప్పన అగ్రహార జైలు నుంచి వారు విడుదలయ్యారు.
అక్కడి నుంచి విజయపురలోని స్వగ్రామానికి తిరిగి వచ్చిన వారిద్దరికీ స్థానిక హిందూ సంఘాల నేతలు పూలమాలలు వేసి, కాషాయ శాలువాలతో సత్కరించారు. వారిద్దరినీ ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు తీసుకెళ్లి, పూలమాల వేశారు.
ఆ తర్వాత కాళికామాత ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక హిందూ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ఇవాళ విజయదశమి అని, తమకు ముఖ్యమైన రోజని తెలిపారు. గౌరీ లంకేశ్ హత్యకు సంబంధించిన ఆరోపణలపై ఆరేళ్లుగా పరశురామ్ వాఘ్మోర్, మనోహర్ యాదవ్ జైల్లో ఉన్నారని చెప్పారు. వారికి ఇప్పుడు స్వాగతం పలికామని అన్నారు. అసలు ఆ కేసులో నేరస్థులు ఎవరో ఇంకా గుర్తించలేదని చెప్పారు.
కాగా, సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో వాఘ్‌మోర్, యాదవ్‌తో పాటు అమోల్ కాలే, రాజేశ్ డి బంగేరా, వాసుదేవ్ సూర్యవంశీ, రుషికేష్ దేవదేకర్, గణేశ్ మిస్కిన్, అమిత్ రామచంద్ర బడ్డీకి కూడా అక్టోబర్ 9న బెయిల్ మంజూరైంది.
Mumbai Local Train : పట్టాలు తప్పిన ముంబై లోకల్ ట్రైన్.. సర్వీసులకు అంతరాయం