పూణే ఫ్యాక్టరీలోని 1419మంది ఉద్యోగులను తొలగించిన జనరల్ మోటార్స్

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జనరల్ మోటర్స్ భారత్ లో 1,419 మంది ఉద్యోగం నుంచి తొలగించింది.

పూణే ఫ్యాక్టరీలోని 1419మంది ఉద్యోగులను తొలగించిన జనరల్ మోటార్స్

General Motors Fires All 1419 Workers From Pune Factory

Updated On : April 19, 2021 / 11:10 PM IST

General Motors అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జనరల్ మోటర్స్ భారత్ లో 1,419 మంది ఉద్యోగం నుంచి తొలగించింది. పూణే శివార్లలోని తాలేగావ్‌ ప్లాంట్‌లో పని చేస్తున్న 1419మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఈ మేరకు ఫ్యాక్టరీ ప్రవేశద్వారం ముందు ఓ నోటీసుని అంటించింది.

అయితే, ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించే ముందు ప్రభుత్వం మరియు కార్మికశాఖ నుంచి జనరల్ మోటార్స్ ఎటువంటి అనుమతలు తీసుకోలేదు. పారిశ్రామిక వివాద చట్టంలోని సెక్షన్‌ 25 ప్రయోగించి ఉద్యోగులను తొలగించి జనరల్ మోటార్స్. ఈ సెక్షన్ ప్రకారం ఉద్యోగుల తొలగింపుకు ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదు. సహజ విపత్తు కరోనా కారణంగా తొలగింపు చోటు చేసుకుందని, ఐడీ యాక్ట్ సెక్షన్ 25ఎం కింద ముందస్తు అనుమతి అవసరం లేదని ఫ్యాక్టరీ గేటు వద్ద ప్రదర్శించిన నోటీసులో కంపెనీ పేర్కొంది.

తొలగించిన ఉద్యోగులందరికీ కంపెనీ ఓ ఈ-మెయిల్‌ పంపింది. అదే కాపీని జనరల్‌ మోటార్స్‌ ఉద్యోగుల యూనియన్‌ కార్యదర్శి, అధ్యక్షుడికి కూడా పంపింది. పారిశ్రామిక వివాద చట్టం 1947లోని సెక్షన్‌ 25-సి ప్రకారం వీరందరికి లే ఆఫ్‌ పరిహారం లభిస్తుందని జనరల్‌ మోటార్స్‌ తెలిపింది. అలాగే, వారి మూల వేతనంలో 50 శాతాన్ని పరిహారంగా చెల్లిస్తామని వెల్లడించింది. అయితే ఒక్కసారి పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడంపై ఉద్యోగ సంఘాలు మండిపతున్నాయి. ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని నిర్ణయించాయి. కంపెనీ నిర్ణయంపై తాము కోర్టులో తేల్చుకుంటామని జనరల్ మోటార్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సందీప్ భెగాడే తెలిపారు.