Farmers Protest : రైతుల పోరాటం ఉధృతం, మరోసారి ట్రాక్టర్ ర్యాలీ

ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న పోరాటాన్ని ఉధృతం చేయాలని రైతులు నిర్ణయించారు. ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి రైతు సంఘాలు. మరోసారి ట్రాక్టర్ల ర్యాలీకి సిద్ధం కావాలని నిర్ణయించాయి. ఈ మేరకు రైతులకు పిలుపునిచ్చారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్.

Farmers Protest : రైతుల పోరాటం ఉధృతం, మరోసారి ట్రాక్టర్ ర్యాలీ

Tractor Rally

Updated On : June 21, 2021 / 9:41 PM IST

Rakesh Tikait : ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న పోరాటాన్ని ఉధృతం చేయాలని రైతులు నిర్ణయించారు. ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి రైతు సంఘాలు. మరోసారి ట్రాక్టర్ల ర్యాలీకి సిద్ధం కావాలని నిర్ణయించాయి. ఈ మేరకు రైతులకు పిలుపునిచ్చారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్. భూమిని రక్షించుకునేందుకు ఆందోళన ఉధృతం చేయాలని ఆయన రైతులను కోరారు.

ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే…ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న ఆందోళనలకు ప్రభుత్వం స్పందించకపోవడంతో ట్రాక్టర్ల ర్యాలీ చేయాల్సి వస్తోందంటున్నారు రాకేశ్ తికాయత్. జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్ల పరేడ్‌లానే దేశమంతా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధం కావాలని రాకేశ్ తికాయత్ కోరారు. ఈ నెల 30వ తేదీన ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న రైతులందరూ క్రాంతి దివస్ నిర్వహించాలని ఇప్పటికే సంయుక్త్ కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఏడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడు రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆదివాసీలను కూడా ఈ పోరాటంలో కలుపుకుపోవాలని భావిస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్‌మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దు గ్రామం సెలగార్‌లో ఆదివాసీలు చేస్తున్న పోరాటానికి సంయుక్త్ కిసాన్ మోర్చ్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది.

గ్రామంలో CRPF క్యాంప్‌ ఏర్పాటుచేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు. గత నెల 17న ఆదివాసీలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ గర్భిణి సహా ముగ్గురు చనిపోయారు. 18 మంది గాయపడ్డారు. మరో 10 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఈ కాల్పులను సంయుక్త్‌ కిసాన్ మోర్చా ఖండించింది. ఈ నెల 30న ఆదివాసీలు..ఢిల్లీ సరిహద్దులకొచ్చి తమ పోరాటంలో పాల్గొనాలని సంయుక్త్ కిసాన్ మోర్చా కోరింది.