Goa Election : గోవా ఎన్నికల వేళ బీజేపీకి షాక్..ఎమ్మెల్యే రాజీనామా
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవాలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కీలక నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారుతున్నారు. తాజాగా బీజేపీ

Goa
Goa Election : వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవాలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కీలక నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారుతున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే కార్లోస్ అల్మైదా బీజేపీ ప్రాథమిక సభ్యత్వాని, తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను మంగళవారం అసెంబ్లీ సెక్రెటరీ నమ్రతా ఉల్మాన్‌కు అందజేశారు.
తాను ఫ్రాడ్ కేసు పెట్టిన వ్యక్తే అయిన దాజీ సల్కర్ నాయకత్వంలో తన నియోజకవర్గమైన వాస్కోలో పని చేయమని బీజేపీ కోరడంతోనే రాజీనామా చేస్తున్నట్టు కార్లోస్ అల్మైదా తెలిపారు. కాగా,ఇటీవల బీజేపీని వీడిన రెండో ఎమ్మెల్యేగా కార్లోస్ అల్మైదా నిలిచారు. ఇక,గడిచిన కొన్ని వారాల్లో గోవా అసెంబ్లీకి రాజీనామా చేసిన ఏడవ ఎమ్మెల్యేగా కార్లోస్ అల్మైదా నిలిచారు.
కాగా, 40 సభ్యులున్న గోవా అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం గోవాలో పర్యటించి ఎన్నికల నిర్వహణ కోసం సన్నాహక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
ALSO READ California Earthquake : కాలిఫోర్నియాలో భారీ భూకంపం