రేపటి నుంచి టూరిస్టులకు గోవా వెల్‌కమ్

గోవా మళ్లీ టూరిస్టులకు వెల్‌కమ్ చెప్పనుంది. రేపటి నుంచి 250 హోటళ్లకు పర్మిషన్లు ఇస్తున్నట్లు మళ్లీ విధులు నిర్వహించుకోవచ్చని అధికారులు చెప్పారు. కానీ, గోవాలోకి ఎంటర్ అవ్వాలంటే COVID-19 నెగెటివ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. 48గంటల కంటే ముందే అది కూడా గోవా హాస్పిటల్ నుంచే సర్టిఫికేట్ తీసుకోవాలని గోవా టూరిజం మినిస్టర్ అగా ఓంకార్ అన్నారు.
దేశవ్యాప్తంగా మార్చి 25 వ తేదీ నుంచి లాక్‌డౌన్ విధించడంతో పర్యాటక రంగాన్ని కూడా స్తంభించిపోయింది. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం, విమానాలు తిరగకపోవడంతో పర్యాటక ప్రాంతాలన్నీ ఖాళీగా ఉండిపోయాయి. పర్యాటకం మీదనే ఆధారపడి ఉన్న గోవా వంటి రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయాయి. విదేశీ పర్యాటకులు ఎక్కువగా వచ్చే గోవా పర్యాటకపరంగా మూగపోయింది.
లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత గోవాలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. జులై 2 వ తేదీ నుంచి విదేశీ పర్యాటకులను మినహాయిస్తూ దేశీ పర్యాటకులకు ఆహ్వానం పలికింది.