Gold Rate Today : వరుసగా మూడవరోజు పెరిగిన బంగారం ధరలు

పసిడి ధర క్రమంగా పెరుగుతుంది. పసిడి బాటలోనే వెండి నడుస్తుంది. వరుసగా మూడవ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఆషాడంతో పోల్చుకుంటే శ్రవణంలో అమ్మకాలు పెరిగాయి

Gold Rate Today : వరుసగా మూడవరోజు పెరిగిన బంగారం ధరలు

Gold Rate Today

Updated On : August 16, 2021 / 10:18 AM IST

Gold Rate Today : పసిడి ధర క్రమంగా పెరుగుతుంది. పసిడి బాటలోనే వెండి నడుస్తుంది. వరుసగా మూడవ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఆషాడ మాసంలో తగ్గిన బంగారం ధరలు శ్రావణమాసంలో పెరుగుతున్నాయి. బంగారం అమ్మకాలు కూడా పెరిగాయి. గత నెలతో పోల్చుకుంటే 10 శాతం మేర అమ్మకాలు పెరిగాయని మార్కెట్ సమాచారం. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 పైకి కదిలింది.

దీంతో బంగారం ధర రూ.49,090 (హైదరాబాద్ మార్కెట్) కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.310 పెరుగుదలతో రూ.45,000 (హైదరాబాద్ మార్కెట్)కు ఎగసింది. బంగారం ధర పైకి చేరితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి రేటు రూ.900 పరుగులు పెట్టింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,200కు ఎగసింది. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,360 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,390 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,160 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,060 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,010 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,010 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,010 ఉంది.