Canara Bank Good News: కెనరా బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ కి గుడ్ న్యూస్.. సేవింగ్స్ అకౌంట్స్ మినిమం బ్యాలెన్స్ పై సంచలన ప్రకటన..
గతంలో, కెనరా బ్యాంక్‌లో సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) అవసరం బ్యాంకు శాఖ స్థానాన్ని బట్టి మారుతూ ఉండేది.

Canara Bank Good News: కెనరా బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ కి గుడ్ న్యూస్. సేవింగ్స్ అకౌంట్స్ మినిమం బ్యాలెన్స్ పై సంచలన ప్రకటన చేసింది కెనరా బ్యాంక్. సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB-యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్) మెయింటేన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. అన్నీ రకాల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ కు( రెగులర్ సేవింగ్ అకౌంట్స్, శాలరీ అకౌంట్స్, ఎన్ఆర్ఐ సేవింగ్ అకౌంట్స్) ఇది వర్తిస్తుంది.
ఈ నిర్ణయంతో కస్టమర్లు ఇకపై సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) నిర్వహించాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ఎటువంటి జరిమానా ఛార్జీలు ఉండవు.
కెనరా బ్యాంక్ తీసుకున్న ఈ చర్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకున్న ఇలాంటి చొరవకు అనుగుణంగా ఉంది. 2020 లో అన్ని పొదుపు ఖాతాలకు కనీస బ్యాలెన్స్ అవసరాన్ని మాఫీ చేసింది ఎస్బీఐ. అందువల్ల, పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోయినా ఎటువంటి జరిమానా ఉండదు. జూన్ 1, 2025 నుండి, కెనరా బ్యాంక్ ఇకపై ఏ రకమైన సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోనూ కస్టమర్లు సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) నిర్వహించాల్సిన అవసరం లేదు.
”జూన్ 1, 2025 నుండి కెనరా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోయినా జరిమానా విధించబడరు. ఇది కస్టమర్లకు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలను అందించే దిశగా మార్పును సూచిస్తుంది” అని పత్రికా ప్రకటనలో బ్యాంక్ తెలిపింది.
Also Read: జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు నుంచి ఆధార్ అప్‌డేట్ వరకు.. 5 ముఖ్యమైన మార్పులివే..!
గతంలో, కెనరా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలలో అవసరమైన సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB).. పొదుపు ఖాతా రకాన్ని బట్టి మారుతూ ఉండేది. ఒక కస్టమర్ ఈ కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించడంలో విఫలమైతే, ఖాతాదారుడిపై జరిమానా విధించేది బ్యాంక్. నిర్దిష్ట పొదుపు ఖాతాను బట్టి ఛార్జీ ఉంటుంది. తాజా నిర్ణయంతో కెనరా బ్యాంక్ కస్టమర్లు అన్ని పొదుపు బ్యాంకు ఖాతాలకు కనీస నిల్వపై ఎటువంటి జరిమానా లేకుండా ప్రయోజనం పొందుతారు.
గతంలో, కెనరా బ్యాంక్‌లో సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) అవసరం బ్యాంకు శాఖ స్థానాన్ని బట్టి మారుతూ ఉండేది. మే 31, 2025 వరకు, కెనరా బ్యాంక్ కస్టమర్లు పట్టణ, మెట్రో నగరాల్లో 2వేల రూపాయల మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉండేది. సెమీ-అర్బన్ ప్రాంతంలో వెయ్యి రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 500 రూపాయల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చేది. జూన్ 1 నుంచి కెనరా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారులందరూ కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోయినా ఇకపై జరిమానాలు ఉండవు.
AMB (సగటు నెలవారీ బ్యాలెన్స్) అనేది జరిమానాలను నివారించడానికి ఒక కస్టమర్ ఒక నెల పాటు తమ బ్యాంక్ ఖాతాలో ఉంచాల్సిన అత్యల్ప సగటు మొత్తం. బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ అవసరమైన బ్యాలెన్స్ కంటే తక్కువగా ఉంటే, AMBని నిర్వహించనందుకు బ్యాంకులు జరిమానా విధిస్తాయి. ఈ జరిమానాలు పొదుపు ఖాతా రకాన్ని బట్టి నిర్ణయించబడ్డాయి.