Mumbai Unlock : నగరవాసులకు శుభవార్త.. కరోనా తగ్గుముఖం.. ఈ నెలాఖరులో ముంబై ‘అన్‌లాక్’..!

ముంబై నగరవాసులకు శుభవార్త.. కరోనా కేసులు తగ్గాయి. అతి త్వరలో ముంబై నగరం లాక్‌డౌన్ నుంచి విముక్తి పొందనుంది.

Mumbai Unlock : నగరవాసులకు శుభవార్త.. కరోనా తగ్గుముఖం.. ఈ నెలాఖరులో ముంబై ‘అన్‌లాక్’..!

Mumbai To 'unlock' By Febru

Updated On : February 8, 2022 / 4:20 PM IST

Mumbai  Unlock  : ముంబై నగరవాసులకు శుభవార్త.. కరోనా కేసులు తగ్గాయి. అతి త్వరలో ముంబై నగరం లాక్‌డౌన్ నుంచి విముక్తి పొందనుంది. ఇక నగరవాసులు హాయిగా ఊపిరిపీల్చుకోవచ్చు.. ఫిబ్రవరి నెలాఖరులో ముంబై నగరాన్ని అన్ లాక్ చేయాలని సిటీ మేయర్ కిషోరి పెడ్నేకర్ (Kishori Pednekar) నిర్ణయించినట్టు ఓ నివేదిక వెల్లడించింది.

మొన్నటివరకూ కరోనా కేసులతో అల్లాడిపోయిన ముంబై నగరం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి తేరుకుంటోంది. కరోనా కేసుల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సిటీ మేయర్ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నగరాన్ని అన్ లాక్ చేసినప్పటికీ కూడా నగరవాసులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించడంతో పాటు సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందని కిషోరి పెడ్నేకర్ తెలిపారు.

ఈ నెలాఖరులోగా ముంబై అన్ లాక్ అవుతుంది. కరోనా కట్టడి చర్యలతో కేసులు తీవ్రత తగ్గినట్టు తెలిపారు. ముంబై అన్ లాక్ చేయడం ద్వారా అనేక మంది ముంబైవాసులకు ఉపశమనం కలిగించే విషయంగా మేయర్ పేర్కొన్నారు. ముంబై నగరంలో సోమవారం (ఫిబ్రవరి 7) 356 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 21, 2021 తర్వాత రోజువారీ కరోనా కేసుల్లో అత్యల్పంగా నమోదయ్యాయి. ఐదు మరణాలు మాత్రమే నమోదయినట్టు సిటీ మేయర్ తెలిపారు.

బృహన్‌ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (BMC) బులెటిన్ ప్రకారం.. కరోనా కేసల సంఖ్య 10,50,194కు చేరగా.. కరోనా మరణాల సంఖ్య 16,654 వద్ద ఉంది. కొత్తగా నమోదైన 356 కరోనా కేసుల్లో 88 శాతం లేదా 313 కేసులు లక్షణాలు లేనివే ఉన్నాయని పేర్కొంది. ముంబైలో కరోనా కేసుల పాజిటివ్ రేటు 1.19 శాతానికి తగ్గింది. గత ఏడాది డిసెంబర్ 21న, కరోనా మూడో వేవ్ ప్రారంభమైంది. అప్పటినుంచి నగరంలో కరోనా కేసుల తీవ్రత పెరిగింది.

కరోనా థర్డ్ వేవ్ (Covid 3rd Wave) ప్రారంభంలో ముంబైలో 321 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక మరణం మాత్రమే నమోదైంది. గత 24 గంటల్లో 29,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. శనివారం కంటే దాదాపు 8,000 తక్కువగా నమోదయ్యాయి. ముంబైలో ఇప్పటివరకు పరీక్షించిన మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 1,55,79,281కి చేరుకుంది. కరోనా కేసుల రెట్టింపు రేటు కూడా 760 రోజులకు చేరింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 మధ్య ముంబైలో కేసుల మొత్తం వృద్ధి రేటు 0.09 శాతంగా ఉందని పేర్కొంది.

ప్రస్తుతం.. పలు ఆస్పత్రుల్లో మొత్తం 37,116 పడకలలో 1,407 పడకలు కరోనా బాధితులతోనే నిండిపోయాయి. మొన్నటివరకు కరోనా కేసులతో నిండిపోయిన ముంబై మురికివాడల్లో గతకొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గడంతో కంటైన్మెంట్ జోన్లు ఎత్తేశారు. కరోనా కేసులు నమోదైన ఒక భవనాన్ని మాత్రమే మూసివేశారు. 2022 జనవరి 7న ముంబై నగరంలో అత్యధికంగా 20,971 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

Read Also : Corona Virus: కరోనా ముగిసింది.. ఐటీ ఉద్యోగులకూ “వర్క్ ఫ్రమ్ హోమ్” అవసరం లేదు