Agneepath scheme: అగ్నివీరులకు హరియాణా సర్కార్ గుడ్ న్యూస్..
అగ్నిపథ్ పథకంను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల పాటు సైన్యంలో పనిచేసి, బయటకువ చ్చిన అగ్నివీరులకు హరియాణా ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాలు ఇస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.

Cm Manoharlal Khattar
Agneepath scheme: అగ్నిపథ్ పథకంను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల పాటు సైన్యంలో పనిచేసి, బయటకువ చ్చిన అగ్నివీరులకు హరియాణా ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాలు ఇస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. వారందరినీ గ్రూపు -సీ కింద గుమస్తాలు, ఉపాధ్యాయులు, ఆఫీస్ అసిస్టెంట్లు వంటి నాన్ గెజిటెడ్ ఉధ్యోగులుగా, పోలీస్ సిబ్బందిగా తీసుకుంటామని చెప్పారు. అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన ప్రతిఒక్కరికి ఈ అవకాశం కల్పిస్తామని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు.
Agnipath: అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తేలేదు: అజిత్ డోభాల్
యువతను మభ్యపెట్టడానికే సీఎం ఈ ప్రకటన చేశారంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. మాజీ సైనికుల్ని నియమించడానికి 50శాతం మించిన రిజర్వేషన్ ను ఎలా వర్తింపజేస్తారని విపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది. ఆ అంశాన్ని ఎవరైనా కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని, యువతను మభ్య పెట్టే ప్రయత్నం చేయొద్దని ఆ పార్టీ సీనియర్ నేత రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా సూచించారు.
Maharashtra Political Crisis: షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా?
అగ్నిపథ్ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో.. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. హరియాణా రాష్ట్రంలోనూ యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. పలు రైళ్లకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో భారీగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. అయితే ఈ నష్టాన్ని ఆందోళనకారుల నుంచే రాబట్టేందుకు వారణాసి యంత్రాంగం చర్యలు చేపడుతుంది.