Maharashtra Political Crisis: షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా?

మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుగుబావుటా ఎగురవేసిన మంత్రి, శివసేన నేత ఏక్​నాథ్​ షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 40 మందిలో మొత్తం 33 మంది శివసేన ఎమ్మెల్యేలు కాగా, మరో ఏడుగురు స్వతంత్రులు ఉన్నట్లు తెలిసింది. అయితే వీరందరు బుధవారం ఉదయంకు అస్సాంలోని గౌహతికి చేరుకున్నారు.

Maharashtra Political Crisis: షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా?

Sivasena

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుగుబావుటా ఎగురవేసిన మంత్రి, శివసేన నేత ఏక్​నాథ్​ షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 40 మందిలో మొత్తం 33 మంది శివసేన ఎమ్మెల్యేలు కాగా, మరో ఏడుగురు స్వతంత్రులు ఉన్నట్లు తెలిసింది. అయితే వీరందరు బుధవారం ఉదయంకు అస్సాంలోని గౌహతికి చేరుకున్నారు. అస్సాంకు వెళ్లే ముందు, ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి నుంచి గుజరాత్‌లోని సూరత్ హోటల్‌లో విడిది చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో షిండే టెలిఫోన్ సంభాషణ చేసిన కొద్దిసేపటికే షిండేతో సహా పార్టీ ఎమ్మెల్యేలను గౌహతికి తరలించడం జరిగింది. ఏక్‌నాథ్ షిండేను పునరాలోచించుకుని తిరిగి పార్టీలోకి రావాలని ఉద్ధవ్ ఠాక్రే కోరారు. సేన బీజేపీతో పొత్తును పునరుద్ధరించుకోవాలని, రాష్ట్రాన్ని ఉమ్మడిగా పాలించాలని షిండే కోరినట్లు తెలిస్తోంది.

Maharashtra: ‘మ‌హా’ స‌ర్కారుకు షాక్.. 10 మంది ఎమ్మెల్యేల‌తో హోట‌ల్‌లో శివ‌సేన నేత‌, మంత్రి ఏక్‌నాథ్ షిండే

షిండే, శివసేన నేతతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలు కూడా సూరత్ హోటల్‌లో ఏక్‌నాథ్ షిండేను కలవడం చర్చనీయాంశంగా మారింది. అస్సాం వెళ్లే ముందు సూరత్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన ఏక్నాథ్ షిండే.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బాలాసాహెబ్ థాకరే హిందుత్వను అనుసరిస్తున్నామని, దానిని మరింత ముందుకు తీసుకువెళతామని అన్నారు. మేము బాలాసాహెబ్ ఠాక్రే యొక్క శివసేనను విడిచిపెట్టలేదని, దానిని విడిచిపెట్టమని స్పష్టం చేశాడు. అంతకుముందు మంగళవారం మధ్యాహ్నం శివసేన పార్టీ చీఫ్ విప్‌గా షిండేను తొలగిస్తూ శివసేన అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తన ట్విట్టర్ బయో నుంచి శివసేన పార్టీ పేరును షిండే తొలగించారు. శివసేనకు చెందిన సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి ఈ కుట్రలకు రూపకల్పన చేస్తోందని ఆరోపించారు. అయితే ఈ వాదనను మహారాష్ట్ర బిజెపి చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఖండించారు. అయితే.. షిండే నుండి వచ్చిన ప్రతిపాదనను తమ పార్టీ ఖచ్చితంగా పరిశీలిస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ స్పందిస్తూ ఇది శివసేన అంతర్గత విషయమని, మూడు పార్టీల ప్రభుత్వానికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని చెప్పారు.

AP Inter Results: నేడు ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

షిండే వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉంటే మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం 287 మంది సభ్యులు ఉన్నారు. అధికార ఎంవీుఏ( శివసేన 55, ఎన్సీపీ 53, కాంగ్రెస్ 44) కూటమి సొంత బలం 152 కాగా స్వతంత్ర, చిన్న పార్టీల ఎమ్మెల్యేలు 15 మంది మద్దతిస్తున్నారు. విపక్ష బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో పది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి బీజేపీ బలం 116 గా ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. షిండే వెంట ప్రస్తుతం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా బీజేపీలో చేరితే బీజేపీ బలం 156కు చేరుతుంది. షిండే వ్యూహాన్నితిప్పికొట్టేందుకు శివసేన అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. షిండే బీజేపీకి మద్దతు ప్రకటిస్తే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కూలడం ఖాయంగా కనిపిస్తోంది.