కలెక్టర్,ఎస్పీ కాలర్లు పట్టుకుంటే గొప్ప నాయకుడవుతారు…విద్యార్థులకు మంత్రి హితబోధ

  • Published By: venkaiahnaidu ,Published On : September 10, 2019 / 07:20 AM IST
కలెక్టర్,ఎస్పీ కాలర్లు పట్టుకుంటే గొప్ప నాయకుడవుతారు…విద్యార్థులకు మంత్రి హితబోధ

Updated On : September 10, 2019 / 7:20 AM IST

మంచి నాయకుడు అవ్వాలంటే  ఏం చేయాలి? నాయకుడిగా ఎదగడానికి కావాల్సిన లక్షణాలు ఏంటి? అని ఎవరైనా అడిగితే.. మంచి పనులు చేయాలి. ప్రజలు, అధికారులతో స్నేహపూర్వకంగా మెలగాలి.. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుని.. ప్రజలకు అండగా ఉన్నప్పుడే నాయకుడిగా రాణించగలుగుతాం అని చెప్తుంటారు కొందరు నాయకులు. కానీ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మంత్రి మాత్రం.. అధికారుల కాలర్‌ పట్టుకుని లాగితే గొప్ప నాయకులు అవుతారని ఓ విద్యార్థికి చెప్పారు.

సుక్మా జిల్లాలో జరిగిన ఓ సమావేశానికి మంత్రి కవాసీ లఖ్మా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అయితే ఓ విద్యార్థి…మీరు గొప్ప నాయకుడిగా ఎదిగారు. ఇది మీకు ఎలా సాధ్యమైంది? నేను కూడా మీలా కావాలంటే ఏం చేయాలి? అని తనను ప్రశ్నించారని మంత్రి చెప్పారు. కలెక్టర్,ఎస్పీ కాలర్ పట్టుకుంటే ప్ప నాయకులు అవుతారని విద్యార్థి ప్రశ్నకు బదులిచ్చినట్లు మంత్రి తెలిపారు.

మంత్రిగారి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విద్యార్థులకు మంత్రి గారు చేసే హిత బోధలు ఇవేనా అంటూ ఆయపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తన వ్యాఖ్యలు తప్పుగా చిత్రీకరించబడ్డాయని మంత్ని కవాసీ అన్నారు. మంత్రి మాట్లాడుతూ…ఏం అవ్వాలని కోరుకుంటున్నారు అని చిన్నారులను అడిగాను. కొంతమంది నాయకులు అవ్వాలని అనుకుంటున్నామని చెప్పారు, మీరు నాయకుడు ఎలా అయ్యారు అని నన్ను అడిగారు. మీరు నాయకులు అవ్వాలంటే ప్రజలకు సేవ చేయమని నేను వారికి చెప్పాను. ప్రజల కోసం కలెక్టర్ కార్యాలయాల దగ్గర పోరాడండి. అని మాత్రమే వారికి చెప్పాను. నా స్టేట్మెంట్ తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ మంత్రి వివరణ ఇచ్చుకున్నారు.