చిట్టితల్లి పెద్ద మనసు : CC కెమెరాల ఏర్పాటుకు రూ.1.50 లక్షల విరాళం 

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 09:44 AM IST
చిట్టితల్లి  పెద్ద మనసు : CC కెమెరాల ఏర్పాటుకు రూ.1.50 లక్షల విరాళం 

Updated On : March 4, 2019 / 9:44 AM IST

 చెన్నై : 9 సంవత్సరాల చిన్నారికి ఆటలు..పాటలు..స్కూల్ కు వెళ్లటం..అమ్మానాన్నలతో ఆడుకోవటం తప్ప అంతకు మించి ఏం తెలుస్తుంది. అమ్మా నాన్నలు ఇచ్చిన పాకెట్ మనీతో చాక్లెట్స్..బిస్కెటస్  కొనుకుని తినటం..తన నేస్తాలతో ఆడుకోవటం లేదంటే టీవీ చూడటం చేస్తుంటారు ఆ వయస్సు పిల్లలు. కానీ ఓ చిన్నారి అందరికంటే భిన్నంగా ఆలోచించింది. తన పెద్ద మనసును చాటుకుంది.  చెన్నై నగరంలో సిసిటీవీలను ఏర్పాటుకు తన పాకెట్ మనీ డబ్బుల్ని రూ.1.50 లక్షలను పోలీసులకు విరాళంగా ఇచ్చింది శ్రీహిత అనే 9 సంవత్సరాల చిన్నారి.  పోలీస్ అధికారుల ప్రశంసల్ని పొందింది.
 

శ్రీహిత్  పెద్ద మనస్సుకు నగర పోలీసు కమిషనర్ విశ్వనాథన్ ఎంతగా సంతోషించారు. కమిషనర్ కార్యాలయంలో ఓ సదస్సును ఏర్పాటు ఆ వేదికపై చిన్నారి శ్రీహితను అభినందించారు. సీసీ  నిఘా కెమెరాల ప్రయోజనాలను వివరించారు. కాగా..ప్రస్తుతం సమాజంలో నేరాలను పట్టించేందుకు సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. వీటి ఆధారంగా..నేరాల కేసులను పరిష్కరించటానికి సీసీ కెమెరాలు పోలీసులు ఎంతగానో ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే.