జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో హింస : పోలింగ్ బూత్‌లపై ఉగ్రదాడి

  • Published By: veegamteam ,Published On : May 6, 2019 / 04:10 AM IST
జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో హింస : పోలింగ్ బూత్‌లపై ఉగ్రదాడి

Updated On : May 6, 2019 / 4:10 AM IST

జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో హింస జరిగింది. ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలింగ్ బూత్ లపై దాడులు చేశారు. 5 నిమిషాల వ్యవధిలో రెండు చోట్ల పోలింగ్ బూత్ లపై దాడులకు తెగబడ్డారు. ట్రాల్,  పుల్వామా పోలింగ్ బూత్ లపై గ్రనేడ్ విసిరారు. రొమ్ మూ గ్రామంలో ఈ ఘటన జరిగింది. జమ్మూకాశ్మీర్ లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ బూత్ పై ఉగ్రదాడి జరగడం ఇదే తొలిసారి. జమ్మూ  కాశ్మీర్‌లోని లడక్ నియోజకవర్గంతోపాటు అనంత్‌నాగ్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పుల్వామా, షోపియాన్‌ జిల్లాల్లో సోమవారం (మే 6,2019) పోలింగ్‌ జరుగుతోంది. ఉగ్రదాడితో భద్రతా  దళాలు అప్రమత్తం అయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు అదనపు భద్రతను కల్పించారు.

అనంత్ నాగ్ నియోజకవర్గంలో 18మంది బరిలో ఉన్నారు. జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెమబూబా ముఫ్తీ బరిలో ఉన్న నియోజకవర్గానికి ఇవాళే పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా  సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్‌ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా దేశంలోని 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం (మే 6,2019) ఉదయం 7  గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. 51 నియోజకవర్గాల నుంచి 674 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 12శాతం మంది మహిళలే. ఈ 51 నియోజకవర్గాల్లో 9 కోట్ల మంది ఓటర్లున్నారు.  సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. రాష్ట్రాల వారీగా చూస్తే యూపీలో 14, రాజస్తాన్‌లో 12, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో చెరో 7, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4 స్థానాలకు  ఎన్నికలు జరుగుతున్నాయి.