GST Council Meeting : ఏపీకి రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.1,265 కోట్లు.. జీఎస్టీ పరిహారం విడుదల

ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు క్లియర్ చేసింది కేంద్రం. GST పరిహారం మొత్తం పెండింగ్ బ్యాలెన్స్ జూన్‌ వరకు మొత్తం రూ. 16,982 కోట్లు క్లియర్ చేసినట్లు మంత్రి నిర్మల చెప్పారు.

GST Council Meeting : ఏపీకి రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.1,265 కోట్లు.. జీఎస్టీ పరిహారం విడుదల

Updated On : February 18, 2023 / 8:28 PM IST

GST Council Meeting : ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు క్లియర్ చేసింది కేంద్రం. GST పరిహారం పెండింగ్ మొత్తం బకాయిలు ఈరోజు నుండి క్లియర్ చేయబడతాయని సమావేశంలో ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. GST పరిహారం మొత్తం పెండింగ్ బ్యాలెన్స్ జూన్‌ వరకు మొత్తం రూ. 16,982 కోట్లు క్లియర్ చేసినట్లు మంత్రి నిర్మల చెప్పారు.

Also Read..Nirmala Sitharaman: పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు మేము సిద్ధం: నిర్మలా సీతారామన్

ఈరోజు నాటికి ఈ మొత్తం నిధులు.. పరిహార నిధిలో అందుబాటులో లేనప్పటికీ సొంత వనరుల నుండి విడుదల చేయాలని నిర్ణయించిట్లు వెల్లడించారు. జీఎస్టీ పరిహారం కింద ఆంధ్రప్రదేశ్ కు రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.1,265 కోట్లు విడుదల చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

Also Read..GST Collection: జనవరి నెలలో భారీగా జీఎస్టీ వసూళ్లు.. ఇప్పటి వరకు రెండో భారీ వసూళ్లు ఇవే ..

ఢిల్లీలో 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ చట్టం-2017కి లోబడి ఐదేళ్ల కాలవ్యవధికి సంబంధించిన అన్ని బకాయిలు చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు మంత్రి నిర్మల. జీఎస్టీ పరిహారాలకు సంబంధించి ఇప్పటివరకున్న అన్ని బకాయిలను రాష్ట్రాలకు చెల్లిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జూన్ మాసానికి సంబంధించిన రూ.16,982 కోట్లను కూడా చెల్లించేందుకు కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఈ చెల్లింపులకు అవసరమైన నిధులు ప్రస్తుతం అందుబాటులో లేవన్న ఆమె.. కేంద్రం సొంత ఆర్థిక వనరుల నుంచి ఈ చెల్లింపులు చేస్తామని వివరించారు. ఇప్పుడు విడుదల చేసిన మొత్తాన్ని భవిష్యత్తులో పరిహార రుసుం వసూళ్ల నుంచి మినహాయించుకుంటామని నిర్మల చెప్పారు. మరోవైపు స్టేషనరీపై జీఎస్టీని 18 నుంచి 12శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.