బుర్రున్నోడు : హెల్మెట్..పట్టట్లేదు..ఫైన్ కట్టమంటే ఎలా

కొత్త మోటారు వాహన చట్టం అమలులో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నారు. కొత్త రూల్స్ తో ప్రజలకు చుక్కలు చూపిస్తున్న పోలీసులు వింత ఘటనలు..సందర్భాలు ఎదురవుతున్నాయి. వాహనానికి సంబంధించిన పేపర్లన్నీ హెల్మెట్ కు అంటించుకున్న వ్యక్తి ఘటన ఒకటైతే..ఫైన్ వేసారంటే ఉరేసుకుని ఛస్తానంటు ఓ యవతి పోలీసులకు చుక్కలు చూపించింది. ఇటువంటివి చూసిన పోలీసులకు ఏం చేయాలో పాలుపోవటంలేదు. ఈ క్రమంలో పాపం..ట్రాఫిక్ పోలీసులక మరో విచిత్రమైన సందర్భం ఎదురైంది. కొత్త రూల్స్ ప్రకారం వెహికల్ పేపర్లతో పాటు హెల్మెట్ తప్పనిసరి. లేదంటే జేబులు ఖాళీ. ఈ విషయం అందరికీ తెలిసిందే.
కానీ..గుజరాత్ ఉదయపూర్ జిల్లాలోని బోడెలి సిటీలో జాకిర్ మామోన్ అనే వ్యక్తి మాత్రం హెల్మెట్ పెట్టుకోకుండా దర్జాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. హెల్మెట్ పెట్టుకోలేదు ఫైన్ కట్టమన్నారు. నేను హెల్మెట్ పెట్టుకోవటం కుదరనే కుదరదన్నాడు. ఎందుకంటే నా బుర్ర పెద్దది నాకు ఏ హెల్మెట్టు పట్టటం లేదని చెప్పాడు. అది విన్న పోలీసులు అయోమయానికి గురయ్యారు. ఏం చేయాలో తోచలేదు.
జాకిర్ దగ్గర హెల్మెట్ తప్పించి వెహికల్ కు సంబంధించి అన్ని పేపర్స్ పక్కాగా ఉన్నాయి. హెల్మెట్ మాత్రం లేదు. మార్కెట్‌లో దొరికే ఏ హెల్మెట్ కూడా తన తలకు సరిపోవడం లేదని..ఎన్నో చోట్ల ట్రై చేశారనీ..కానీ ఏవీ తన తలకు పట్టటం లేదని..అయినా ఫలితం లేదని వాపోయాడు. తనకు చట్టాలంటే గౌరవం ..కానీ చట్టంలో ఉన్న రూల్స్ ప్రకారంగా హెల్మెట్ మాత్రం పెట్టుకోలేనని చెప్పాడు. దీంతో పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఇటువంటి విచిత్ర ఘటనలు ఎదురైనప్పుడు ఏంచేయాలో పాపం..ట్రాఫిక్ పోలీసులకు అర్థం కావటంలేదు. ఇక చేసేదేమీ లేక..జాకిర్‌కు చలానా వేయకుండానే వదిలేశారు.
ఈ సందర్భంగా..బోడెలి పట్టణ ట్రాఫిక్ బ్రాంచ్ అసిస్టెంట్-సబ్-ఇన్స్పెక్టర్ వసంత రత్వ మాట్లాడుతూ..ఇది ఒక ప్రత్యేకమైన సమస్య అతని సమస్యను అర్థం చేసుకున్నాం. దీంతో అతనికి ఫైన్ వేయలేకపోయామనీ..వదిలేయక తప్పలేదని అన్నారు.