Back Flips with Saree: రంగులు చల్లుతూ..చీరతో బ్యాక్‌ఫ్లిప్ చేస్తూ..హోలీ శుభాకాంక్షలు

Gymnast Wishes Performing Back Flips In A Sare (2)
Gymnast Wishes Performing Back Flips In A Sare : చీరతో అన్ని రకాల ఫీట్లు చేయలేం. కానీ అది అసాధ్యం కాదని ఎంతోమంది అతివలు చేసి చూపించారు. ముఖ్యంగా జిమ్నాస్టిక్ ఫీట్స్ చేయాలంటే చీరతో అసాధ్యం. కానీ..అసాధ్యాన్ని సుసాధ్యంచేయటమే అతివల పని. అలా ఎంతోమంది చీరతో బ్యాక్‌ఫ్లిప్ చేసి అదరహో అనిపించారు.
అలా ఓ అమ్మాయి హోళీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుందో చూస్తే..వారెవ్వా అనిపిస్తుంది. పైగా చక్కగా చీర కట్టుకుని రంగుల కేళీ హోలీ పండుగను సెలబ్రేట్ చేస్తూ హోళీ పండుగను బ్యాక్‌ఫ్లిప్ తో మజా చేసింది జిమ్నాస్ట్ పరుల్ అరోరా. చీర కట్టుకుని చేతులతో రంగులు పట్టుకుని బ్యాక్‌ఫ్లిప్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు పరుల్ అరోరా.
ఆమె తన జిమ్నాస్టిక్, ఏమాత్రం తడబడకుండా ఫుల్ కంఫర్ట్ గా రంగులతో చేసి చూపించారామె. ఆ తరువాత హోలీలో ఉండే అన్ని రంగులు ఆమె కళ్లల్లో ఆనందంగా మారి కనిపించి కనువిందు చేశాయి..! ఇప్పటికే ఎన్నో సార్లు పరుల్ అరోరా చీరతో చాలాసార్లు బ్యాక్ ప్లిప్ చేసారు. జిమ్నాస్టిక్స్లో పరుల్ అరోరా జాతీయ స్థాయి బంగారు పతక విజేత కూడా..