ఇలాంటి శానిటైజర్లు కరోనా వైరస్‌ నుంచి కాపాడలేవు!

  • Published By: veegamteam ,Published On : March 9, 2020 / 06:56 AM IST
ఇలాంటి శానిటైజర్లు కరోనా వైరస్‌ నుంచి కాపాడలేవు!

Updated On : March 9, 2020 / 6:56 AM IST

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ కరోనా వైరస్ పేరు వినబడితే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. అలాంటి కరోనా వైరస్ రాకుండా కొన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటున్నాం. అలాంటి వాటిలో ముఖ్యంగా హ్యాండ్ వాష్ చేసుకోవటం. వాటి కోసం కొన్ని రకాల శానిటైజర్స్ ని వాడుతున్నాం. 

ఈ వైరస్ కారణంగా మార్కెట్ లో శానిటైజర్స్ డిమాండ్ ఎక్కవగా ఉంది. ఈ డిమాండ్ పెరగటం వల్ల మార్కెట్ లో దొరికే ఏదో ఒక ప్రోడక్ట్ ని వాడటం వల్ల అవి క్రిములని నాశనం చేయటంలోను, సురక్షితంగా ఉంచటంలో విఫలమౌతున్నాయి.

సెంటర్స్ ఆఫ్ డిస్జిస్ కంట్రోల్(CDC) తెలిపిన ప్రకారం హ్యాండ్ శానిటైజర్స్ లో కనీసం 60 శాతం ఆల్కహాల్ ఉండాలి. కాని మార్కెట్ లో ఆల్కహాల్ లేని కొన్ని రకాల హ్యాండ్ శానిటైజర్స్ దొరుకుతున్నాయి. అంతేకాకుండా ఆన్ లైన్ లో డిమాండ్ పెరిగిపోవటం వల్ల, అవి పని చేయకపోయినా సరే వాటిని కోనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు.

పాపులర్ బ్రాండ్స్ హ్యాండ్ శానిటైజర్స్ పురెల్, జెర్మ్-ఎక్స్ వంటి వాటిలో కొన్ని సార్లు ఆల్కహాల్ కి బదులుగా బెంజల్కోనియం క్లోరైడ్ ని ఉపయోగిస్తారు. ఇవి వైరస్ లను చంపటంలో తక్కువ పాత్ర పోషిస్తాయి అని ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో సిడిసి తెలిపింది. ఇటువంటి ఆల్కహాల్ లేని హ్యాండ్ శానిటైజర్స్ ని ఉపయోగించటం వల్ల  క్రిములు వంటివి నాశనం కాకపోవచ్చు అని సిడిసి తెలిపింది. అలాంటి వాటిని వాడటం మంచిది కాదు. కాని ప్రజలు మాత్రం వాటిని తెలియకుండా కొనుగోలు చేసి వాడుతున్నారు.(కరోనీ ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో 16రెట్లు పెరిగిన శానిటైజర్‌ ధర)