MLA Umang Singhar : హనుమంతుడు ఆదివాసీ, మనం అతని వారసులం..అందుకు గర్వపడండీ
రామభక్తుడు హనుమంతుడు మరోసారి వార్తల్లోకెక్కారు. హనుమాన్ జన్మస్థలంపైనే వివాదం కొనసాగుతున్న క్రమంలో హనుమాన్ ఆదివాసీ మనం అతని వారసులం అంటూ హనుమంతుడిని మరోసారి వార్తల్లోకి తెచ్చారు ఓ ఎమ్మెల్యే.

Congress MLA Umang Singhar
MLA Umang Singhar – Lard Hanuman Adivasi : హనుమంతుడు లేని రామాయణం లేదు. రాముడుకి అత్యంత భక్తుడు హనుమంతుడు. అటువంటి హనుమంతుని జన్మస్థలంపైనా ఆయన జన్మించిన సామాజిక వర్గంపై ఎన్నో వ్యాఖ్యలు, మరెన్నో వివాదాలు. హనుమంతుడు ఓ గిరిజనుడని, ఆదివాసీ అని అంటుంటారు. ఈ క్రమంలో మరోసారి హనుమంతుడు వార్తల్లోకొచ్చారు. హనుమంతుడు ఆదివాసీ అంటూ చెప్పుకొచ్చారు మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఎమ్మెల్యే ఉమంగ్ సింగర్. రామాయణం((Ramayan)లో కోతులుగా అభివర్ణించిన వారు గిరిజనులు(Tribals) అంటూ చెప్పుకొచ్చారు మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, గంద్వానీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింగర్.
గిరిజన నాయకుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా (Birsa Munda) 123 వర్థంతి సందర్భంగా థార్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఉమంగ్ సింగర్ మాట్లాడుతూ.. హనుమంతుడు ఆదివాసీ అని వ్యాఖ్యానించారు. రాముడిని శ్రీలంకకు తీసుకెళ్లింది ఆదివాసీలు (హనుమంతుడు, వానరసైన్యం) వానరసైన్యం అని కొంతమంది కథల్లో రాశారు. కానీ రామాయణంలో కోతులు లేవు. వారంతా ఆదివాసీలు, అరణ్యాల్లో నివసించేవారు. హనుమంతుడు కూడా ఆదివాసీయే అని చెప్పుకొచ్చారు. మనం అతని వారసులం, అందుకు గర్వపడండీ అని వ్యాఖ్యానించారు.
Indrakiladri : జూన్ 19 నుంచి ఇంద్రకీలాద్రిపై ‘ఆషాడమాసం సారె’ ప్రారంభం..
ఎమ్మెల్యే ఉమంగ్ సింగర్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ బీజేపీ అధికార పర్తినిథి హితేష్ బాజ్ పాయ్ మండిపడ్డారు. వారు హనుమాన్ ను అవమానిస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అలా అన్నవారు హనుమంతుడికి దేవుడిగా భావించరు అంటూ విమర్శించారు. అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమంగ్ అంటూ ఏకిపారేశారు. హనుమంతుడి విషయంలో కాంగ్రెస్ విధానం ఇదేనా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ క్యాథలిక్ మత గురువుల భాష మాట్లాడుతోందా? మతమార్పిడులు చేయండీ అంటూ మాజీ సీఎం కమల్ నాథ్, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ లకు ట్యాగ్ చేశారు.
కాగా.. గతంలో ఎమ్మెల్యే ఉమంగ్ సింగర్ పై ఆయన భార్య అత్యాచారం, గృహ హింస ఆరోపణలతో కేసు పెట్టారు. అంతేకాదు, అసహజ శృంగారం, నేరపూరిత బెదిరింపులు వంటి ఆరోపణలతోనే ఆయన సొంత జిల్లా ధర్‌లో కేసు నమోదైంది. రేప్ కేసుతోపాటు తన భర్తపై సంచలన ఆరోపణలు ఆమె చేశారు. తమ ఆస్తులు కొన్నింటిని ఇంటి పని మనిషి భర్త పేరు మీద రాశారని ఆరోపించారు.
గతంలో.. రాజస్థాన్ లోని అల్వార్ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజా హనుమంతుడు గురించి మాట్లాడుతూ.. ప్రపంచంలోని మొట్టమొదటి ఆదివాసి ఆంజనేయస్వామి అంటూ వ్యాఖ్యానించారు. హనుమంతుడి అనుచరులైన వానర సైన్యానికి శ్రీరాముడు ట్రైనింగ్ ఇచ్చాడని వ్యాఖ్యానించగా అవి వైరల్ అయ్యాయి.