ManuBhaker: తొలిసారి ఓటు వేసిన ఒలింపిక్ పతక విజేత మనుభాకర్.. పోలింగ్ బూత్ ఏం చేసిందో తెలుసా.. వీడియో వైరల్

ఓటింగ్ అనంతరం మనుభాకర్ మీడియాతో మాట్లాడారు. నేను మొదటి సారి ఓటు వేశానని తెలిపారు. ఈ దేశ యువతగా..

ManuBhaker: తొలిసారి ఓటు వేసిన ఒలింపిక్ పతక విజేత మనుభాకర్.. పోలింగ్ బూత్ ఏం చేసిందో తెలుసా.. వీడియో వైరల్

Manu Bhaker

Updated On : October 5, 2024 / 9:24 AM IST

Haryana Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. 90 నియోజకవర్గాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 1,031 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోలింగ్ సందర్భంగా ఉదయం నుంచే ప్రముఖులు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో షూటింగ్ విభాగంలో విజేతగా నిలిచిన మనుభాకర్ ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి హర్యానా ఝుజ్జర్ లోని పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వెలుపల క్యూలైన్లో వేచిఉండి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి ఆమె పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వేచిఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : Haryana Elections 2024: హర్యానాలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. బరిలో ప్రముఖులు వీరే..

ఓటింగ్ అనంతరం మనుభాకర్ మీడియాతో మాట్లాడారు. నేను మొదటి సారి ఓటు వేశానని తెలిపారు. ఈ దేశ యువతగా.. స్థానిక ప్రజలు, దేశం అభివృద్ధికోసం కృషిచేసే అభ్యర్థికి మన ఓటు వేయడం మన బాధ్యత. చిన్న అడుగులు పెద్ద లక్ష్యాలకు దారితీస్తాయని మనుభాకర్ పేర్కొన్నారు.