Nursery, LKG, UKG రద్దు.. ఐదేళ్లు నిండాకే బడికి : ప్రభుత్వం కీలక నిర్ణయం
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు రద్దు చేసింది. ఇకపై కిండర్ గార్టెన్ క్లాస్లులు నిర్వహించొద్దని ప్రైవేట్ స్కూల్స్ కు ఆదేశాలు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు రద్దు చేసింది. ఇకపై కిండర్ గార్టెన్ క్లాస్లులు నిర్వహించొద్దని ప్రైవేట్ స్కూల్స్ కు ఆదేశాలు
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు రద్దు చేసింది. ఇకపై కిండర్ గార్టెన్ క్లాస్లులు నిర్వహించొద్దని ప్రైవేట్ స్కూల్స్ కు ఆదేశాలు ఇచ్చింది. ఐదేళ్ల వయసు వచ్చాకే పిల్లలను స్కూల్ లో జాయిన్ చేసుకోవాలని చెప్పింది.
హాయిగా ఆడుకునే వయసులో పిల్లలను స్కూల్ బాట పట్టించడం సరికాదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అందుకే ఐదేళ్ల తర్వాతే పిల్లలను స్కూల్స్ లో జాయిన్ చేయించుకోవాలని ఆదేశించామని వివరించాయి. పిల్లలు ఆడుకోవడానికి, మానసికంగా ఎదగడానికి తగినంత సమయం కావాలని, దానిని దృష్టిలో ఉంచుకుని కిండర్ గార్టెన్ తరగతులను మూసివేయాలని నిర్ణయించామని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
ఈ రోజుల్లో వీధికి మూడు నాలుగు ప్రైవేట్ స్కూల్స్ వెలుస్తున్నాయి. రెండున్నరేళ్లకు పిల్లలను స్కూల్స్‌లో జాయిన్ చేసుకుంటున్నాయి. దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పించేస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటూ మూడేళ్లకే చిన్నారులతో అక్షరాలు దిద్దిస్తున్నారు. వారిపై మానసికంగా ఒత్తిడి తెస్తున్నారు. హాయిగా ఆడుతూ బాల్యం గడపాల్సిన పిల్లలను చదువు పేరుతో స్కూల్స్ లో బంధించడం కరెక్ట్ కాదనే వాదనలూ ఉన్నాయి. దీంతో ఏకీభవించిన హర్యానా సర్కార్.. ఇక నుంచి ప్రైవేట్ స్కూల్స్‌లో కిండర్ గార్టెన్ తరగతులు నిర్వహించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కరెక్ట్ నిర్ణయం అని కొందరు, కాదని కొందరు తమ వాదనలు వినిపించారు.