Election Results 2024: హరియాణా, జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు..

హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడెంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.

Election Results 2024: హరియాణా, జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు..

Haryana, Jammu And Kashmir Election Results 2024

Updated On : October 8, 2024 / 8:52 AM IST

Haryana, Jammu And Kashmir Election Results 2024: హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడెంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు ఫలితాల సరళిపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. హరియాణాలోని 90 నియోజకవర్గాల్లో 1,031 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. జమ్మూ కశ్మీర్ లో 90 నియోజకవర్గాల్లో 873 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Also Read: Vinesh Phogat: హరియాణా ఎన్నికలు.. వినేశ్ ఫోగట్ జులనాలో గెలుస్తుందా.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే?

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు హరియాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అంచనా వేశాయి. ఇక జమ్మూకాశ్మీర్ లో హగ్ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. ఇదిలాఉంటే.. హరియాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. దీనికితోడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలుసైతం స్పష్టమైన మెజార్టీని కాంగ్రెస్ సాధిస్తుందని అంచనా వేయడంతో.. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందస్తు వేడుకలకు సిద్ధమయ్యారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 మార్క్ దాటాలి.

హరియాణాలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. జమ్మూకాశ్మీర్ లో కాన్ఫరెన్స్ పార్టీ ఆధిక్యంలో ఉంది. హరియాణాలోని జులనా నియోజకవర్గం నుంచి వినేశ్ ఫోగట్ ఆధిక్యంలో కొనసాగుతుంది.