SC-ST Act: దళిత విద్యార్థులతో బలవంతంగా టాయిలెట్లు కడిగించిన ప్రిన్సిపాల్

ఆ చిన్నారి ఆ పాఠశాలలో 4వ తరగతిలో చేరాడు. అప్పటి నుంచి వాటర్ ట్యాంకు కడగడం, టాయిలెట్లు కడగడం లాంటివి చేస్తున్నాడట. తనతో పాటు మరికొంత మంది ఎస్పీ పిల్లలతో ఈ పని చేపిస్తున్నారట ఆ పాఠశాల ప్రిన్సిపాల్. ఇలాంటి పనుల కారణంగా చాలా మంది పిల్లల చేతులపై బొబ్బలు వచ్చినట్లు తెలిపాడు. విద్యార్థుల్ని రెండు గ్రూపులుగా విడదీసి విడతల వారీగా ఈ పనులు చేయిస్తున్నారట.

SC-ST Act: దళిత విద్యార్థులతో బలవంతంగా టాయిలెట్లు కడిగించిన ప్రిన్సిపాల్

Headmistress makes students clean school toilets in Perundurai

Updated On : December 1, 2022 / 6:45 PM IST

SC-ST Act: దళిత విద్యార్థుల చేత బలవంతంగా టాయిలెట్లు కడిగిస్తున్న స్కూల్ ప్రిన్సిపాల్‭పై ఎస్సీ-ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని పలక్కరై పంచాయతీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసిన ఘటన ఇది. ఎన్నాళ్ల నుంచో సాగుతున్న ఈ వ్యవహారం.. 5వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన అనంతరం బయటపడింది.

సదరు విద్యార్థికి డెంగ్యూ వచ్చింది. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా.. పాఠశాలలో రోజూ జరిగే తతంగం గురించి వెల్లడించాడు. పాఠశాలలో టాయిలెట్లు కడుగుతున్నానని, అందుకే జబ్బు పడ్డానని తల్లిదండ్రులతో చెప్పాడు. ఈ పని తన చేత తన ప్రిన్సిపాల్ చేయిస్తున్నారని వెల్లడించాడు. దీంతో వెంటనే వారు పోలీసుల ఫిర్యాదు చేశారు.

Gujarat Polls: గ్రామాల్లోని వారికి నీళ్లు, సోడా లేకపోయినా నడిచిపోతుంది.. ఎన్నికల్లో మద్యం పంపిణీపై పబ్లిక్‭గా వాగిన ఆప్ ఎమ్మెల్యే

ఆ చిన్నారి ఆ పాఠశాలలో 4వ తరగతిలో చేరాడు. అప్పటి నుంచి వాటర్ ట్యాంకు కడగడం, టాయిలెట్లు కడగడం లాంటివి చేస్తున్నాడట. తనతో పాటు మరికొంత మంది ఎస్పీ పిల్లలతో ఈ పని చేపిస్తున్నారట ఆ పాఠశాల ప్రిన్సిపాల్. ఇలాంటి పనుల కారణంగా చాలా మంది పిల్లల చేతులపై బొబ్బలు వచ్చినట్లు తెలిపాడు. విద్యార్థుల్ని రెండు గ్రూపులుగా విడదీసి విడతల వారీగా ఈ పనులు చేయిస్తున్నారట.

పిల్లల తల్లిదండ్రులు ఈ విషయమై ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్‭పై ఫిర్యాదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల బాలల సంక్షేమ కమిటీకి సైతం ఫిర్యాదు చేశారు. సదరు ప్రిన్సిపాల్‭పై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నాలుగు సెక్షన్ల ప్రకారం.. కేసు నమోదు చేసి, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

Betting Kills Father : తీవ్ర విషాదం.. తండ్రి ప్రాణం తీసిన కొడుకుల బెట్టింగ్, మద్యం మత్తులో ఈదలేక తండ్రి మరణం