Heartwarming Video : చెల్లీ.. మనం సేఫ్..! అఫ్ఘాన్ నుంచి క్షేమంగా బయటపడ్డ చిన్నారి ఆనందం

నాలుగు రోజులుగా తాలిబన్ల మధ్య భయం భయంగా గడిపిన కుటుంబాలు ఆదివారం(ఆగస్టు 22,2021) ఘజియాబాద్-హిండోన్ ఎయిర్ బేస్ లో దిగాయి. సురక్షితంగా భారత్ కు చేరుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు

Heartwarming Video : చెల్లీ.. మనం సేఫ్..! అఫ్ఘాన్ నుంచి క్షేమంగా బయటపడ్డ చిన్నారి ఆనందం

Heartwarming Video

Updated On : August 22, 2021 / 10:25 PM IST

Heartwarming Video : నాలుగు రోజులుగా తాలిబన్ల మధ్య భయం భయంగా గడిపిన కుటుంబాలు ఆదివారం(ఆగస్టు 22,2021) ఘజియాబాద్-హిండోన్ ఎయిర్ బేస్ లో దిగాయి. సురక్షితంగా భారత్ కు చేరుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఇండియా తిరిగొచ్చిన వారిలో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకట్టుకుంది. సురక్షితంగా భారత్ చేరుకోవడంతో ఆ పాప ఎంతో ఆనందంగా కనిపించింది.

తాలిబన్ మూకల ఆగడాలను కళ్లారా చూసిన ఆ చిన్నారి ఒక్కసారిగా ప్రశాంత వాతావరణం చూడటంతో సంతోషంతో ఉప్పొంగిపోయింది. హ్యాపీ మూడ్ లో ఉల్లాసంగా గడిపింది. బాంబుల మోతలు, బుల్లెట్ల శబ్దాలు లేని వాతావరణాన్ని ఆస్వాదించింది. చెల్లీ మన సేఫ్ అనే అర్థం వచ్చేలా.. తన తల్లి ఒడిలో ఉన్న చెల్లిని ముద్దాడి ఆ పాప తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ పాప ఆనందం హృదయాలను హత్తుకుంది.

కాబూల్ నుంచి యుద్ధ ప్రాతిపదికన భారతీయుల తరలింపు ప్రారంభమైంది. 107 మంది భారతీయులతో సహా మొత్తం 168 మంది ప్రయాణికులతో కూడిన ఇండిగో, ఎయిరిండియా విమానాలు ఆదివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాయి. తజికిస్తాన్ రాజధాని దుషన్ బే, ఖతార్ విమానాశ్రయాల ద్వారా ఇవి ఢిల్లీ చేరాయి. వీరి తరలింపు దృశ్యాలను విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విటర్ లో షేర్ చేశారు.

అఫ్ఘాన్ లోని వివిధ నగరాల్లో ఇంకా సుమారు వెయ్యి మంది భారతీయులు ఉన్నట్టు అంచనా. వారిని కూడా తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి రోజుకు రెండు భారతీయ విమాన సర్వీసులకు అమెరికా, నాటో దళాలు అనుమతించాయి. దీంతో ఇక ఈ యత్నాలు మరింత జోరందుకోనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయం చేరే ముందు భారతీయులు.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అఫ్ఘానిస్తాన్ నుంచి సురక్షితంగా ఇండియా చేరుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు.