Heatwave in Country: ముంబై, ఢిల్లీ నగరాల్లో వేడి సెగలు: ముంబైలో యెల్లో అలర్ట్

ముంబై మహానగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు అయిందని వాతావరణశాఖ వెల్లడించింది

Heatwave in Country: ముంబై, ఢిల్లీ నగరాల్లో వేడి సెగలు: ముంబైలో యెల్లో అలర్ట్

Heat Wave

Updated On : March 15, 2022 / 9:39 PM IST

Heatwave in Country: దేశంలో పలు నగరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు ఐఎండీ వాతావరణ విభాగం తెలిపింది. ముంబై మహానగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు అయిందని వాతావరణశాఖ వెల్లడించింది. సోమవారం నాడు ముంబై శివారులో 39.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మంగళవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. సాధారణంగా మార్చి చివరి వారం నుంచి ముంబైలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది రెండో వారంలోనే ఎండలు మండుతుండడంపై అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం నాడు ముంబై పరిసర ప్రాంతాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు..బుధవారం యెల్లో అలర్ట్ ప్రకటించారు.

Also read:IIM Alumni: పాల ప్యాకెట్స్‌పై ఓ ముద్ర.. సోషల్ మీడియాలో రచ్చ!

ప్రజలు మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముంబై మహానగర పాలక సంస్థ అధికారులు హెచ్చరించారు. వేడి నుంచి రక్షణ పొందే విధంగా తరచూ మంచి నీళ్లు తాగాలని అధికారులు సూచించారు. మరోవైపు ఢిల్లీ నగరంలోనూ పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఢిల్లీలో మధ్యాహ్నం సమయంలో 33-35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే.. రాత్రి వేళలో 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఎండ వేడిమి తాళలేక, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశంలో వేడిగాలులు తీవ్రతరం కావడంతో గుజరాత్‌లో మంగళ, బుధవారాల్లో ‘ఎల్లో’ అలర్ట్‌ ప్రకటించారు. గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాలలో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందని, అహ్మదాబాద్‌లో ఉష్ణోగ్రత 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Also read: Power Bills : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే