Heavy Rains : చెన్నై మునిగిపోతుందా..ఏంటా వర్షాలు..ఎక్కడ చూసినా వరదే
చెన్నై మునిగిపోతుందా? వామ్మో.. ఏంటా వర్షాలు.. ఎక్కడ చూసినా వరదే..! ఎటుచూసినా నీరే..! నదులు ఉప్పొంగుతున్నాయి..! అటు వాయుగుండం తీరం దాటేసింది..!

Stailn
Heavy Rains Lash Chennai : చెన్నై మునిగిపోతుందా? వామ్మో.. ఏంటా వర్షాలు.. ఎక్కడ చూసినా వరదే..! ఎటుచూసినా నీరే..! నదులు ఉప్పొంగుతున్నాయి..! అటు వాయుగుండం తీరం దాటేసింది..! అయితే వర్షాలు తగ్గుతాయి అనుకుంటే తగ్గట్లేదు. మరో 24గంటలు దంచికొట్టేలా కనిపిస్తున్నాయి. ఆరు రోజులుగా నాన్‌స్టాప్‌గా చెన్నైపై విరుచుకుపడ్డ వరుణుడు శాంతించినట్లే కనిపిస్తున్నాడు. ఇంతలోనే ఉగ్రరూపం చూపిస్తున్నాడు. వరద నీటిని పెంచేలా ఒక రౌండ్‌వేసి పోతున్నాడు. దీంతో ఇళ్లల్లోనే ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే వర్షాలకు అక్కడ 14 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Read More : Chennai Rains: చెన్నై చిత్రాలు.. వరదల్లో మనిగిన ఊర్లు

వాయుగుండం ప్రభావంతో కురుస్తోన్న భారీ వర్షానికి చెన్నై చిగురుటాకులా వణుకుతోంది. ఎటుచూసినా నీరే కనిపిస్తోంది. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు నీట మునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నైలో అన్ని సబ్‌వేలు నీట మునగడంతో వాటిని మూసివేశారు. లోతట్టు ప్రాంతాలు, టీ నగర్, నుంగంబాక్కం, కొళత్తూరు, పెరంబూరు, పరిసరాల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతవాసులు ఇళ్లను ఖాళీచేశారు. సెంబరంబాక్కం రిజర్వాయర్ నుంచి భారీగా నీరు విడుదల చేస్తుండడంతో ఆ తీరం వెంబడి వరద ఉధృతి పెరిగింది.
Read More : Cyclone Alert : నెల్లూరులో కుండపోత..50 గ్రామాలకు రాకపోకలు బంద్

మహాబలిపురం నుంచి ఎన్నూర్ వరకు అలల తాకిడి ఎక్కువగా ఉంది. పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. పుదుచ్చేరిలో సముద్రం ముందుకు రావడంతో 50 ఇళ్లు దెబ్బతిన్నాయి. మహాబలిపురం మార్గాన్ని అధికారులు మూసివేశారు. మైలాపూర్‌లో ఓ వృద్ధుడు విద్యుదాఘాతానికి గురై మరణించాడు. నీటి ఉధృతి, అలల తాకిడితో మనలి హైరోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి. అటు భారీ వరదల కారణంగా కేకే నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రి కూడా నీటమునిగింది. ఎయిర్‌పోర్టులోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
Read More : Holidays: ఏపీలో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్నారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను ఎప్పటికప్పుడు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పర్యవేక్షిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి కారైక్కల్, శ్రీహరికోట మధ్య చెన్నైకి సమీపంలో తీరం దాటింది. ఈ వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. చెన్నైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ జారీ చేసిన హెచ్చరికను ఐఎండీ సవరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికగా మార్పు చేసింది.