Cyclone Alert : నెల్లూరులో కుండపోత..50 గ్రామాలకు రాకపోకలు బంద్

భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో పల్లెలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Cyclone Alert : నెల్లూరులో కుండపోత..50 గ్రామాలకు రాకపోకలు బంద్

Nellore

Nellore Heavy Rains : భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో పల్లెలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూళ్లూరుపేట, తడ, దొరవారి సత్రం, నాయుడుపేటలో వర్షం బీభత్సం సృష్టించింది. 50కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూళ్లూరుపేటలో కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోకులక్రిష్ణ కాలేజ్ వద్ద జాతీయ రహదారిపైకి భారీగా నీరు చేరింది. దీంతో చెన్నై – కలకత్తా రాకపోకలకు అంతరాయం కలిగింది. కాళంగి డ్యామ్ 18 గేట్లను ఎత్తివేశారు.

Read More : UP : బరి తెగించిన అధికారి..సహోద్యోగినిపై లైంగిక వేధింపులు, వీడియో వైరల్

సోమశిల రిజర్వాయరుకు వచ్చే వరద 28 వేల క్యూసెక్కులకు పెరగడంతో.. అవుట్‌ ఫ్లోను పెంచారు.  మరోవైపు తీర ప్రాంతంలో సముద్రం 20 మీటర్లు ముందుకొచ్చింది.  జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం  55.1 మీల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. సూళ్లూరుపేటలో అత్యధికంగా  18.4 సెoటీమీటర్లు వర్షం కురిసింది. జోరు వానకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. మైపాడు, తూపిలి పాలెం వద్ద సముద్రం అల్లకల్లోలం మారింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పంట పొలాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.

Read More : Hyderabad : రూ.5తో 40కిలోమీటర్లు.. బ్యాటరీ సైకిల్ రూపొందించిన హైదరాబాద్ వాసి

స్వర్ణముఖి నదిలో ఆనకట్టపై గేట్లను దాటి ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దొరవారిసత్రం రైల్వేస్టేషన్‌లో సిగ్నల్‌ వ్యవస్థ దెబ్బతినడంతో హావ్‌డా, బెనారస్‌, పినాకిని ఎక్స్ ప్రెస్‌లు ఆలస్యంగా నడిచాయి. తడలో జాతీయ రహదారిపై వర్షం నీటిలో పలు వాహనాలు మొరాయించాయి. రోడ్లపైనా, కాలనీల్లోనూ మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. ఇళ్లలోకి వరదబురద చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎటుచూసినా నీరు కనిపించడంతో నెల్లూరు వాసులంతా ఇళ్లకే పరిమితమయ్యారు.