West Bengal : పశ్చిమ బెంగాల్లో హైటెన్షన్.. సువేందు అధికారి పీఏపై బుల్లెట్ల వర్షం.. దారుణ హత్య.. టీఎంసీ కీలక ప్రకటన..
West Bengal : ఫలితాలు వెల్లడైన మరుసటిరోజే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత, ముఖ్యమంత్రి రేసులో ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది.
Chandranath Rath
- పశ్చిమ బెంగాల్ లో హైటెన్షన్ వాతావరణం
- సువేందు అధికారి పీఏ దారుణ హత్య
- బైక్ పై వచ్చి కాల్పులు జరిపిన దుండుగుల
- గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
West Bengal : ఫలితాలు వెల్లడైన మరుసటిరోజే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ ఓటమి పాలైంది. భారతీయ జనతా పార్టీ 207 స్థానాల్లో మెజార్టీతో చారిత్రాత్మక విజయం సాధించింది. అయితే, ఎన్నిల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ అగ్రనేత, ముఖ్యమంత్రి రేసులో ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది.
ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే గుర్తుతెలియని దుండగులు అతిదగ్గరి నుంచి చంద్రనాథ్ రథ్ పై కాల్పులు జరిపారు. ఆయన వాహనాన్ని మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగులు వెంబడించారు. ట్రాఫిక్ కారణంగా కారు వేగం తగ్గగానే దగ్గరగా వచ్చి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దీంతో చంద్రనాథ్ రథ్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమైన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందాడు. అతనితోపాటు మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
బీజేపీ నేత సువేందు అధికారి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. పక్కా పథకం ప్రకారమే నా పీఏను చంపారు. బెంగాల్ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తాం. హత్య వెనుక మమత మేనల్లుడి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. మరోవైపు చంద్రనాథ్ హత్య టీఎంసీ పనేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మరోవైపు ఈ ఘటనను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింస, హత్యలకు తావులేదు. చంద్రనాథ్ హత్యపై కోర్టు పర్యవేక్షణలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరిపించాలి. ఈ రక్తపాతానికి కారకులైన నిజమైన దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేసింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పటికీ గత మూడు రోజుల్లో బీజేపీ శ్రేణుల చేతిలో తమ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది.
బెంగాల్ డీజీపీ సిద్ధనాథ్ గుప్తా మాట్లాడుతూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. ఘటనా స్థలంలో బుల్లెట్ సెల్స్ స్వాధీనం చేసుకున్నామని, నిందితులు వాడినట్లుగా అనుమానిస్తున్న నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న ఒక వాహనాన్ని సీజ్ చేశామని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా షూటర్ల కోసం గాలిస్తున్నామని డీజీపీ తెలిపారు.
