Hijab Row: హిజాబ్ ను విద్యాసంస్థల బయటే ధరించండి

కర్ణాటక హైకోర్టులో హిజాబ్ అంశంపై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వ తరపు న్యాయవాది హిజాబ్ ను విద్యా సంస్థల బయట ధరించాలంటూ సోమవారం వాదన వినిపించారు.

Hijab Row: హిజాబ్ ను విద్యాసంస్థల బయటే ధరించండి

Hijab Row

Updated On : February 21, 2022 / 8:58 PM IST

Hijab Row: కర్ణాటక హైకోర్టులో హిజాబ్ అంశంపై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వ తరపు న్యాయవాది హిజాబ్ ను విద్యా సంస్థల బయట ధరించాలంటూ సోమవారం వాదన వినిపించారు. రేపటికి వాయిదా వేయడంతో మంగళవారం మధ్యాహ్నం 2గంటల 30నిమిషాలకు మరోసారి విచారణ మొదలుకానుంది.

లైవ్ లా అనే ఆన్‌లైన్ కథనం ప్రకారం.. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్గీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో మూడు ప్రశ్నలను పరిశీలనలోకి తీసుకోవాలని సూచించారు. ‘హిజాబ్ ధరించడం తప్పనిసరేనా అని మూడు పరీక్షలు వివరిస్తున్నాయి. అది ఒక భాగమా లేదా తప్పనిసరా? మత ప్రాథమిక సిద్ధాంతాల్లో ఒకటా? ఈ ఆచారం పాటించకపోతే మతం నుంచి వెలివేస్తారా? అనేది పరిశీలించాలి.

కర్ణాటక హైకోర్ట్ బెంచ్ చీఫ్ జస్టిస్ అవస్థి.. జస్టిసెస్ కృష్ణా దీక్షిత్, జేఎమ్ ఖాజీలతో విచారణ జరుపుతుంది. హిజాబ్ ను విద్యా సంస్థల్లోకి అనుమతించాలా వద్దా అనే విషయాన్ని ప్రకటించారు.

Read Also: ‘హిజాబ్‌ను వ్య‌తిరేకించే వాళ్లను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తా’

అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్గీ.. ‘ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ఆపరేటివ్ పార్ట్ అనేది సంస్థలకే వదిలివేస్తుంది. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం.. ఒకే యూనిఫాం ధరించనిచ్చేందుకు పూర్తి స్వయంప్రతిపత్తిని ఇస్తుంది. సెక్యూలర్ వాతావరణాన్ని పెంపొందించడం కర్ణాటక విద్యా చట్టం ఉద్దేశ్యం’ అని వెల్లడించారు.