మదురై లో నామినేషన్ దాఖలు చేసిన హిజ్రా : లోక్ సభ ఎన్నికలు

  • Published By: chvmurthy ,Published On : March 20, 2019 / 06:30 AM IST
మదురై లో నామినేషన్ దాఖలు చేసిన హిజ్రా : లోక్ సభ ఎన్నికలు

Updated On : March 20, 2019 / 6:30 AM IST

మదురై: లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం సోమవారం నుంచి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులు తమ నామినేషన్లు దాఖలు చేసే పనిలో ఉన్నాయి. నామినేషన్ వేసిన అభ్యర్ధులు ప్రచారం లో దూసుకు పోతున్నారు. భారతీ కన్నమ్మ అనే హిజ్రా తమిళనాడులోని మదురై లోక్ సభ స్దానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు.
Read Also :20 రోజుల తర్వాత : వచ్చేది ప్రజల ప్రభుత్వమే

58 ఏళ్ల కన్నమ్మ 2004 నుంచి  ట్రాన్స్ జెండర్ల  హక్కుల కోసం పోరాడుతూ, సాంఘిక సేవ చేస్తున్నారు. 2014 లోనూ  లోక్ సభకు పోటీ చేసిన కన్నమ్మ 1,226 ఓట్లు సాధించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మదురై సెంట్రల్ నియోజక వర్గం నుంచి  కూడా అసెంబ్లీ కి పోటీ చేసే యోచనలో కన్నమ్మ ఉన్నారు. అవినీతిరహిత పాలన,జీవన ప్రమాణాల పెరుగుదుల,మానవ హక్కులను కాపాడాలని కన్నమ్మ తన ప్రచారంలో కోరుతున్నారు.  
Read Also :నరసాపురం టూ భీమవరం : అన్నయ్య పార్లమెంట్.. అసెంబ్లీకి తమ్ముడు.. రీజన్ ఇదే