నమాజ్ చేస్తున్న ముస్లింలపై పూల వర్షం కురిపించిన హిందువులు.. వీడియో వైరల్

కాషాయ దుస్తులు ధరించిన హిందువులు నమాజ్ చేస్తున్న ముస్లిం సోదరులపై పూల వర్షం కురిపించారు.

నమాజ్ చేస్తున్న ముస్లింలపై పూల వర్షం కురిపించిన హిందువులు.. వీడియో వైరల్

Hindus showered flowers on Muslims

Updated On : March 31, 2025 / 12:49 PM IST

Ramadan 2025: భారతదేశ వ్యాప్తంగా ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. ఒకరినిఒకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే, రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో రంజాన్ వేళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

Also Read: ఆదివారం రోజున నాన్ వెజ్ ఎందుకు తినకూడదంటే..?

జైపూర్ లోని ఢిల్లీ రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద రోడ్డుపై ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో తరలివచ్చి నమాజ్ చేస్తుండగా హిందూ ముస్లిం ఐక్యతా కమిటీ ఆధ్వర్యంలో కాషాయ దుస్తులు ధరించిన హిందువులు మేడపై నుంచి వారిపై పూల వర్షం కురిపించారు. ఈ దృశ్యం హిందూ- ముస్లిం ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.