Hitech Copy Attempt : వారెవ్వా… ఎగ్జామ్‌లో కాపీయింగ్ కోసం చెవుల్లో ఏం దాచుకొచ్చాడో చూడండి..

ప్రభుత్వ ఉద్యోగానికి నిర్వహించే పరీక్షలు ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తారు. బాగా చెక్ చేశాకే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్ లోకి అనుమతి ఇస్తారు. సెల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు వెంట తీసుకు రానివ్వ

Hitech Copy Attempt : వారెవ్వా… ఎగ్జామ్‌లో కాపీయింగ్ కోసం చెవుల్లో ఏం దాచుకొచ్చాడో చూడండి..

Hitech Copy Attempt

Updated On : October 10, 2021 / 7:42 PM IST

Hitech Copy Attempt : ప్రభుత్వ ఉద్యోగానికి నిర్వహించే పరీక్షలు ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తారు. బాగా చెక్ చేశాకే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్ లోకి అనుమతి ఇస్తారు. సెల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు వెంట తీసుకు రానివ్వరు. ఇక కాపీ కొట్టడానికి అవకాశమే ఉండదు. అయితే కొందరు అభ్యర్థులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఎగ్జామ్ లో కాపీ కొట్టేందుకు కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు.

Face Book Friend Cheating : ఫేస్‌బుక్ లో పరిచయం….రూ. 27లక్షలు దోచేసిన యువతులు

తాజాగా ఓ అభ్యర్థి అలానే ప్లాన్ చేశాడు. అంతా సజావుగా సాగిపోతుందని భావించాడు. కట్ చేస్తే.. కథ అడ్డం తిరిగింది. అతడి ప్లాన్ ఫెయిల్ అయ్యింది. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఎంతో తెలివిగా ఎవరికీ తెలియకుండా చెవుల్లో మైక్రో ఫోన్లు దాచుకుని వచ్చినా అధికారులు పట్టేశారు.

మహారాష్ట్రలోని జల్ గావ్ జిల్లాలో కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థుల్లో ఒకతను అదిరిపోయే ప్లాన్ వేశాడు. మాస్ కాపీయింగ్ కోసం రెండు చెవుల్లో మైక్రో ఫోన్లు దాచుకుని వచ్చాడు. ఇక ఎవరికీ అనుమానం రాదు, తాను ఎంచక్కా కాపీ కొట్టి పరీక్ష పాస్ అవ్వొచ్చని కలలు కన్నాడు. కానీ, అధికారులు ఎలా పసిగట్టారో తెలియదు కానీ, అతడిపై వారికి డౌట్ వచ్చింది. అంతే, అతడి ప్లాన్ ను ఛేదించారు.

TSRTC : దసరా పండుగ, ఆర్టీసీ బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవ్

ఎక్స్ పర్ట్ ని పిలిపించి అతడి చెవులు చెక్ చేశారు. ఈ క్రమంలో షాకింగ్ విషయం తెలిసింది. అతడి రెండు చెవుల్లో మైక్రో ఫోన్లు ఉండటాన్ని పసిగట్టారు. వాటిని చెవుల్లోంచి బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో మహారాష్ట్ర డీజీపీ సంజయ్ ట్విటర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారెవ్వా.. ఏం తెలివి.. నీది..అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.