పూరీ జగన్నాథ్ గుడి జెండాను తాకిన మంటలు

ఒడిశాలో ఉన్న పూరీ జగన్నాథ్ గుడిపై ఉన్న జెండాకు నిప్పంటుకుంది. దాని పక్కనే ఉంచిన పెద్ద ల్యాంప్ సెగకు ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు అధికారులు. పాపనాశిని ఏకాదశి కార్యక్రమంలో భాగంగా మహాదీపాన్ని జెండా పక్కన వెలిగించారు. ప్రత్యేక సందర్భాల్లోనే ఇలా చేస్తుంటారు. అదే సమయంలో ఈదురుగాలి రావడంతో ఇలా జరిగింది.
అయినప్పటికీ ప్రధాన జెండా భద్రంగానే ఉన్నదని.. నీల చక్రకు కింద ప్రతిష్టించిన చిన్న జెండాకు మాత్రమే నిప్పంటుకున్నట్లు సమాచారం. ఈ ఘటన ఫలితంగా గుడిలో జరుగుతున్న కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలగలేదు.
జగన్నాథ్ టెంపుల్‌ను భక్తుల కోసం.. ఏప్రిల్ 1వరకూ మూసేసి ఉంచుతారు. కరోనాను అడ్డుకునేందుకు.. ప్రజలు గుమిగూడకూడదనే క్రమంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా.. ప్రభావం కనిపిస్తుండగా ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం సేఫ్ గానే ఉంది. కరోనా లక్షణాలు కనిపించాయని టెస్టు చేసిన ఏడుగురికి రిపోర్టుల్లో నెగెటివ్ అనే వచ్చింది.
Also Read | సింగర్ కనికా కపూర్‌పై కేసు నమోదు : ఏకాంతంలో ప్రముఖులు