Union Home Secretary : విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి సమీక్ష

రాష్ట్ర విభజన అంశాలపై ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఎపి, తెలంగాణా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఈ రోజు తో వీడియో సమావేశం నిర్వహించారు. 

Union Home Secretary : విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి సమీక్ష

Union Home Secretary

Updated On : January 12, 2022 / 11:59 AM IST

Union Home Secretary : రాష్ట్ర విభజన అంశాలపై ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఎపి, తెలంగాణా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఈ రోజు వీడియో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఎపి, తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.సమీర్ శర్మ, తెలంగాణా సిఎస్   సోమేశ్ కుమార్ లతో అజయ్ భల్లా సమీక్షించారు. ముఖ్యంగా షెడ్యూల్ 9లో పేర్కొన్న వివిధ సంస్థలు, షీలా బేడి కమిటీ సిఫార్సు చేసిన 19 అంశాలపైనా సమీక్షించారు. ఇంకా వివిధ అంశాలపై సమీక్షించారు.
Also Read : Tirumala : తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
అమరావతి  సచివాలయం నుండి ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మతో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కరికల వల్లవన్, కెఎస్.జవహర్ రెడ్డి,  ఎపి జెన్ కో ఎండి శ్రీధర్,  ఎస్ఆర్సి ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి,  ముఖ్య కార్యదర్శి ఎంకె.మీనా,  ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సివిల్ సప్లయిస్ కమీషనర్ గిరిజా శంకర్ ఇతర అధికారులు పాల్గొనగా ఢిల్లీ నుండి వీడియో లింక్ ద్వారా రాష్ట్ర  ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తదితరులు పాల్గొన్నారు.