hope buses : రాజధాని రోడ్లపై పరుగెడుతున్న పాఠశాల..పేదపిల్లలకు భోజనం పెట్టి చదువు
కరోనా వల్ల చదువులకు దూరం అయిన పిల్లలకే కాకుండా మురికివాడల్లో ఉండే పేద పిల్లల కోసం ఓ స్వచ్చంద సంస్థ పరుగులు పెట్టే పాఠశాలను ఏర్పాటు చేసింది. పిల్లలకు కడుపు నింపి చదువులు చెబుతోంది. బస్సుల్లో పిల్లలను ఎక్కించుకుని పాఠాలు చెబుతోంది. అలా ఢిల్లీలోని పలు మురికివాడ పిల్లలకు చదువుకునే చేస్తోంది.

Teaching In Hope Buses (1)
Teaching in hope buses : వలసదారులు, కార్మికులు,పేద పిల్లలు ఇలా విద్య అందుకోలేని పిల్లల కోసం నాలుగు బస్సులు ప్రతీవారం న్యూఢిల్లీ మురికివాడల్లోకి వెళ్తాయి. బస్సుల్లో పిల్లలను ఎక్కించుకుని పాఠాలు చెబుతారు. బస్సుల్లో తిరుగుతు పాఠాలు నేర్చుకునేందుకు పిల్లలు ఆసక్తి చూపిస్తుండటంతో ఈ బస్సుల్లోనే చక్కగా పిల్లలకు పాఠాలుచెబుతున్నారు. మధ్యాహ్నాం భోజనాలు కూడా పెడుతోంది ఓ స్వచ్చంధ సంస్థ.తేజస్ ఆసియా’ అనే ఎన్‌జీవో ఏడేళ్ల కిందట కమ్యూనిటీ స్కూల్‌ని ప్రారంభించింది. బడులు లేని ప్రాంతాల్లో చిన్నారులకు పాఠాలు చెప్పేందుకు ‘హోప్ బస్సు’లను తయారుచేసింది. అలా నాలుగు బస్సులు ఢిల్లీలోని ఎనిమిది ప్రదేశాలకు వెళుతున్నాయి. అక్కడ పిల్లలకు రెండు గంటలపాటు పాఠాలు చెప్పి మరోచోటికి వెళతాలు టీచర్లు.
ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. దీంతో రెండేళ్ల నుంచి అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీంతో విద్యార్థుల చదువులకు బ్రేకులు పడ్డాయి. విద్యా సంవత్సరం నష్ట పోకూడదని ప్రభుత్వం ఏదో పాస్(pass) చేస్తుంది. కానీ అలా చేస్తే విద్యార్థులు పై క్లాసులకు వెళతారు గానీ వారికి నైపుణ్యం ఉంటుందా? విజ్ఞానం అలవడుతుందా? అనేది పెద్ద ప్రశ్నార్థకమే. కానీ ఆన్లైన్లో క్లాసులతో పాఠాలు చెప్పిస్తోంది ప్రభుత్వం. కానీ అవి ఎంత వరకూ పిల్లలకు అర్థం అవుతాయి? అంటే అది మరో ప్రశ్న. మరోపక్క ఆన్లైన్ చదువులంటే మాటలా? పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఉండాలి. అది అందరికీ సాధ్యమువుతుందా? అందరికి అంతటి ఆదాయం ఉంటుందా? ట్యాబ్లు, ల్యాప్టాప్, ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాల్సిందే.
పేద, మధ్య తరగతి వారికి ఇటువంటివి కొనుక్కోవాలంటే కష్టమే. మరి వారి పిల్లలు ఎలా చదువుకోవాలి? అటువంటి అవకాశం లేనివారు ఇక చదువులు మానేయాల్సిందేనా? వారి చదువుకు దూరం కావాల్సిందేనా? అంటే..ఏం అవసరం లేదు. అటువంటివారి కోసం మేమున్నాం అంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. అటువంటి పిల్లలకు చదువు అందించటం కోసం కృషి చేస్తోంది. అటువంటి పేద పిల్లల కోసం బస్సు పాఠాలు ప్రారంభించింది. ఓ బస్సునే స్కూల్ గా మార్చేసింది. ‘తేజస్ ఆసియా” అనే ఎన్‌జీవో సంస్థ. ఆ పాఠశాల ఇప్పుడు ఢిల్లీ రోడ్లపై పరుగెత్తుతోంది. పిల్లలకు విద్యా బుద్దులు నేర్పిస్తోంది. చదువుకోవడానికి వచ్చిన పిల్లలకు కడుపు నింపి మరీ చదువు చెబుతోంది. మధ్యాహ్న భోజనం పెట్టి చదువులు చెబుతోంది. ఇంతకీ బస్సులో పాఠాలెలా? ఎవరు చెబుతున్నారో తెలుసుకుందాం..
కరోనా వల్ల ఆన్లైన్ విద్యకు దూరమైన పిల్లలకు ఢిల్లీలోని ‘హోప్’ అనే కమ్యూనిటీ స్కూల్ సహాయపడుతుంది. మొబైల్ తరగతి గదుల ద్వారా వెనుకబడిన పిల్లలు చదువు నేర్చుకోవడంలో సహాయపడుతుంది. ఉచిత విద్య, మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పిస్తోంది తేజస్ ఆసియా’ ఏడేళ్ల కిందట కమ్యూనిటీ స్కూల్‌ని ప్రారంభించింది. బడులు లేని ప్రాంతాల్లో చిన్నారులకు పాఠాలు చెప్పేందుకు ‘హోప్ బస్సు’లను తయారు చేసింది. అలా నాలుగు బస్సులు ఢిల్లీలోని ఎనిమిది ప్రదేశాలకు వెళుతున్నాయి. అక్కడ పిల్లలకు రెండు గంటలపాటు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు మరో చోటికి వెళుతారు. విద్యార్థులకు పుస్తకాలు,ఆహారం, పలకలు, పెన్నులు కూడాఇస్తున్నారు. ప్రాథమిక విద్యా నైపుణ్యాలను నేర్పిస్తూ పిల్లల సామర్థ్యాన్నిబట్టి విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారు.
ఈ పరుగెత్తే పాఠశాల గురించి తేజస్ ఆసియా సంస్థ హోప్ వ్యవస్థాపకుడు మార్లో ఫిలిప్ మాట్లాడుతూ..
కరోనా వల్ల వచ్చిన లాక్‌డౌన్ వల్ల స్కూల్స్ మూసేయటంతో చాలామంది హోప్ బస్సుల్లో చదువుకోవడానికి వస్తున్నారని..దీంతో విద్యార్థులు పెరగటంతో పాటు బస్సుల సంఖ్యను కూడా పెంచామని తెలిపారు. హోప్ బస్సుల ద్వారా ప్రత్యేకంగా ఒక అండర్ సర్వడ్ కమ్యూనిటీలోని ప్రదేశాలకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే వారు బడికి వెళ్లే అవకాశం లేకపోవడంతో పాఠశాలనే విద్యార్థుల వద్దకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. హోప్ బస్సులు వారి జీవితాల్లో నిజమైన హోప్‌ను కలిగిస్తున్నాయని నమ్ముతుమని దీనికోసం మేం కృషి చేస్తున్నామని తెలిపారు.