Indian Army: భారత సైన్యంలో నారీ శక్తి.. త్రివిధ దళాల్లో రాణిస్తున్న ధీరవనితలు..
మన దేశంలోని త్రివిధ దళాల్లో అత్యధిక శాతం మహిళలు ఉన్నది ఇండియన్ ఎయిర్ పోర్స్ లో..

Indian Army
Indian Army: భారత్, పాకిస్థా దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న వేళ భారత సైన్యంలోని ఇద్దరు మహిళల పేరు దేశవ్యాప్తంగానేకాక.. ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. వారే.. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఆపరేషన్ సిందూర్ వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన అధికారిక విలేకరుల సమావేశానికి ఈ ఇద్దరు మహిళా అధికారులు నాయకత్వం వహించడం ఒక చరిత్ర అని చెప్పొచ్చు. వీరిద్దరూ మన దేశంలో నారీ శక్తికి ప్రతిభింబాలు. దీనికితోడు.. సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి ప్రతీకగా వీరిద్దరూ నిలిచారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మన దేశంలోని త్రివిధ దళాల్లో మహిళల పాత్ర ఏ స్థాయిలో ఉందన్న విషయంపై కేంద్రీకృతమైంది.
మన దేశంలోని త్రివిధ దళాల్లో అత్యధిక శాతం మహిళలు ఉన్నది ఇండియన్ ఎయిర్ పోర్స్ లో.. అందులో 2024 నాటికి 13.40శాతం మంది అతివలే. ఆ తరువాత ఇండియన్ నేవీలో అత్యధిక శాతం మంది మహిళలు ఉన్నారు. త్రివిధ దళాల్లో 2024లో మహిళలు ఎంత మంది ఉన్నారని ఓసారి పరిశీలిస్తే. ఆర్మీలో 1,735(4.12శాతం), ఎయిర్ ఫోర్స్ లో 1,614 (13.40శాతం), నేవీలో 798 (6.81శాతం), రక్షణ పరిశోధన రంగంలో 3,196 (15.53శాతం), పోలీసు విభాగంలో 9.74శాతం మంది మహిళలు ఉన్నారు.
కొన్ని ప్రధాన విభాగాల్లో పరిశీలిస్తే.. సివిల్ పోలీస్ 2,14,187 (14.97శాతం), డీఏఆర్పీ 27,010 (11.31శాతం), ఆర్పీఎఫ్ 5,938 (9.22శాతం), సీఐఎస్ఎఫ్ 10,001 (7.04శాతం), ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ పోలీస్ 8,162 (5.84శాతం), స్పెషల్ ఆర్మ్ డ్ పోలీస్ బెటాలియన్ 14,403 (4.34శాతం), సశస్త్ర సీమా బల్ 3,667 (4.15శాతం), సరిహద్దు భద్రతా దళం 8,442 (3.44శాతం), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 9,425 (3.19శాతం) మంది మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు.