Pahalgam: పహల్గాంకు మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అనే పేరు ఎలా వచ్చింది.. దాని ప్రత్యేకత ఏంటి..

మన దేశానికి చెందిన టూరిస్టులే కాదు విదేశాలకు చెందిన టూరిస్టులు కూడా ఎక్కువగా అక్కడికే వెళ్తారు..

Pahalgam: పహల్గాంకు మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అనే పేరు ఎలా వచ్చింది.. దాని ప్రత్యేకత ఏంటి..

Updated On : April 23, 2025 / 10:30 PM IST

Pahalgam: పహల్గాం.. ఉగ్రవాదుల మారణహోమంతో ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. పహల్గాంలో ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పహల్గాం గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. అసలీ పహల్గాం ఎక్కడుంది? దానికి అంత క్రేజ్ ఎందుకు వచ్చింది? పహల్గాంకు స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా, మినీ స్విట్జర్లాండ్ అనే పేర్లు ఎలా వచ్చాయి? మన దేశానికి చెందిన టూరిస్టులే కాదు విదేశాలకు చెందిన టూరిస్టులు కూడా ఎక్కువగా అక్కడికే ఎందుకు వెళ్తారు? అంత ప్రత్యేకత అక్కడ ఏముంది? అనేది తెలుసుకోవడానికి అంతా ఆసక్తి చూపిస్తున్నారు.

పహల్గాం జమ్మకశ్మీర్‌లోని ఒక కొండ ప్రాంతం. ప్రముఖ పర్యాటక కేంద్రం. జమ్మూకశ్మీర్‌కు వచ్చే టూరిస్టుల్లో ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో పహల్గాం ఒకటి. పచ్చిక బయళ్లతో, సరస్సులతో పహల్గాం చాలా అందంగా ఉంటుంది. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు పెద్ద సంఖ్యలో పహల్గాంకు వస్తుంటారు.

మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో టూరిస్టులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఈ సమయంలో పహల్గాం అందాలను చూసే అవకాశం ఉంటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. తీవ్రమైన చలి ఉంటుంది. స్విట్లర్లాండ్‌లో ఉన్నట్లు కనుచూపు మేర ముదురు ఆకుపచ్చ రంగులో పచ్చిక మైదానాలు బైసరన్ వ్యాలీలో కనిపిస్తుంటాయని, అందుకే తరచూ దీన్ని ‘మినీ స్విట్జర్లాండ్’గా చెబుతుంటారు.

Also Read: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన ఆ వ్యాఖ్యలే జమ్ముకశ్మీర్‌ లో ముష్కరుల మారణహామానికి కారణమా?

స్విట్జర్లాండ్‌లోని లంగెర్న్ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యానికి, పహల్గాంకి దగ్గర పోలికలు ఉన్నాయని టూరిస్టులు అంటుంటారు. ఇక్కడి ప్రకృతి అందాలు మైమరిచిపోయేలా చేస్తాయి. ఆ ప్రకృతి అందాల వల్లే దీనికి మినీ స్విట్జర్లాండ్ అని పేరు వచ్చిందట.

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని అనంత్‌నాగ్ జిల్లాలో చుట్టూ పచ్చని అరణ్యంతో, ఎత్తైన కొండల మధ్యన పహల్గాం ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే మార్గాల్లో అత్యంత ముఖ్యమైన ప్రాంతం ఇది. చూడగానే మైమరిచిపోయే ప్రకృతి అందానికి పెట్టింది పేరు పహల్గాం. ఇక, పహల్గాం చుట్టుపక్కల కూడా ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి. చందన్‌వరీ, బైసరన్, శేష్‌నాగ్ లేక్, పంచతర్ణి, అమర్‌నాథ్ గుహ, అరు వ్యాలీ, లిడ్డర్‌వాట్ పహల్గాంని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు.

ఇక పహల్గాంలో చాలా సినిమాల షూటింగ్ లు జరిగాయి. ఇక్కడి లొకేషన్లు చాలా అద్భుతంగా ఉండటమే అందుకు కారణం. అనేక తెలుగు సినిమాల షూటింగ్ లో పహల్గాం జరిగాయి. అల్లు అర్జున్ నా పేరు సూర్య, నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ పెళ్లి సందడి, విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాల షూటింగ్స్ పహల్గాంలోనే జరిగాయి. స్విట్జర్లాండ్ ను తలపించే అందాల కారణంగా నిర్మాతలు ఇక్కడ షూటింగ్స్ కు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తారట.

Also Read: గుండెలు పిండే విషాదం.. వారం క్రితమే వివాహం, ఇంతలోనే దారుణం.. హనీమూన్‌కు వచ్చి భర్తను కోల్పోయిన భార్య..

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై స్పందించిన నేచురల్ స్టార్ నాని.. మూడు నెలల క్రితం తాము అక్కడే ఉన్నామని గుర్తు చేసుకున్నారు. హిట్ 3 మూవీ షూటింగ్ అక్కడే జరుపుకుందని చెప్పారు. దాదాపు 20 రోజుల పాటు 200 మంది టీమ్ కలిసి పని చేశామన్నారు. పహల్గాం కల లాంటిదని, ఈ దాడి చూస్తుంటే హృద‌యం బద్దలైందని ఆవేదన వ్యక్తం చేశారు నాని.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here