హ్యూస్టన్‌లో భారీ వర్షాలు : హౌడీ – మోదీ సభకు ఏర్పాట్లు

హౌడీ – మోదీ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు పర్యటన కొనసాగనుంది. హ్యూస్టన్, న్యూయార్క్ నగరాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2014 ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది ఆరోసారి. రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి. సెప్టెంబర్ 22వ తేదీ హ్యూస్టన్ నగరంలో ప్రవాస భారతీయులతో హౌడీ – మోదీ పేరిట భారీ సభ జరుగనుంది. ఇందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
కానీ హ్యూస్టన్ నగరంతో పాటు టెక్సాస్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 1500 మంది స్వచ్చంద కార్యకర్తలు నిర్విరామంగా పనిచేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయడం లేదు. ముందు జాగ్రత్త చర్యగా టెక్సాస్ నగరంలోని దక్షి భాగంలో ఉన్న 13 నగరాల్లో ఎమర్జెన్సీ విధిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అయినా..కార్యక్రమం ఘనంగా..విజయవంతంగా నిర్వహిస్తామంటున్నారు నిర్వాహకులు. NRG స్టేడియంలో జరుగనుంది ఈ సమావేశం. దాదాపు 50 వేల మంది హాజరవుతారని అంచనా.
హౌడీ అంటే : అమెరికా నైరుతీ ప్రాంతాల్లో స్నేహ పూర్వకంగా పిలిచే హౌ డు యూ డు ను క్లుప్తంగా హౌడీ అంటారు. అందుకే ఈ కార్యక్రమానికి ఆ పేరు పెట్టారు.
Read More : హౌడీ- మోడీ : అమెరికా షెడ్యూల్ వివరాలు