Birbhum coal mine : బొగ్గుగనిలో భారీ పేలుడు.. ఏడుగురు కార్మికులు మృతి

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బొగ్గుగనిలో బాంబు పేలి ఏడుగురు కార్మికులు మరణించారు.. మరికొందరికి గాయాలయ్యాయి.

Birbhum coal mine : బొగ్గుగనిలో భారీ పేలుడు.. ఏడుగురు కార్మికులు మృతి

Birbhum Coal Mine Blast

Updated On : October 7, 2024 / 2:34 PM IST

Birbhum Coal Mine Blast: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బీర్‌భూమ్ జిల్లాలోని ఖోరాషోల్ బ్లాక్ వదులియా గ్రామంలోని ఓ ప్రైవేట్ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Also Read: Delhi: ఢిల్లీలో హైఅలర్ట్.. ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్.. రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు

గంగారామ్‌చక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొలీరీ కంపెనీ పేరుగల బొగ్గు గనిలో క్రషింగ్ సమయంలో బాంబు పేలింది. భారీ శబ్దాలు రావడంతో పలువురు కార్మికులు, అధికారులు అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి పరుగులు తీశారు. ఘటన తరువాత ఆ ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బొగ్గుగని సమీపంలో పార్కింగ్ చేసిన వాహనాలు ద్వంసం అయ్యాయి.