Delhi: ఢిల్లీలో హైఅలర్ట్.. ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్.. రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు

ఢిల్లీలో అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రవాదులు భారీ దాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా విభాగం హెచ్చరికల నేపథ్యంలో

Delhi: ఢిల్లీలో హైఅలర్ట్.. ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్.. రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు

high alert in Delhi

Updated On : October 7, 2024 / 11:02 AM IST

High Alert In Delhi : ఢిల్లీలో అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రవాదులు భారీ దాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా విభాగం హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారీ కుట్రకు పథక రచన చేసినట్లు.. ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్, తనిఖీలను పెంచాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశాయి. విదేశీ పౌరులను రక్షణ కవచంగా ఉపయోగించుకునేలా ఉగ్రవాదులు వ్యూహాలు సిద్ధం చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

Also Read: టార్గెట్ 2026.. ఏడాది తరువాత అమిత్ షా సమీక్ష.. హాజరుకానున్న సీఎం రేవంత్

కొన్ని ఉగ్రముఠాలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని నిఘా విభాగం తెలిపింది. కొన్ని దేశాల ఎంబసీలను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాలతోపాటు.. ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.