Kolkata : ఆ షాపు ముందు భారీ క్యూ.. ఎందుకో తెలుసా?

క్యూలైన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇదేదో మద్యం షాపు ముందుకట్టిన క్యూలైన్ కాదు. బుక్ స్టోర్ ముందు కట్టిన క్యూలైన్.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా 50 శాతం డిస్కౌంట్ తో పుస్తకాలు విక్రయిస్తుండటంతో కొనేందుకు బుక్ స్టోర్ వద్దకు వచ్చిన కస్టమర్లు రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూ కట్టారు.

Kolkata : ఆ షాపు ముందు భారీ క్యూ.. ఎందుకో తెలుసా?

Kolkata

Updated On : August 13, 2021 / 7:08 PM IST

Kolkata : క్యూ లైన్ కనపడితే అది వైన్ షాప్ అని చాలామంది ఫిక్స్ అయిపోతారు. కొన్ని సార్లు సినిమా థియేటర్లలో కూడా క్యూ లైన్ ఉంటుంది. అయితే ఆన్లైన్ టికెట్ బుకింగ్ వచ్చిన తర్వాత సినిమా థియేటర్లలో పెద్దగా క్యూ లైన్స్ కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ క్యూలైన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ క్యూలైన్ మద్యం షాపు ముందో, లేదంటే సినిమా థియేటర్ ముందో కాదు.. అది ఒక బుక్ స్టోర్‌ ముందు ఉంది. ఈ సాంకేతిక యుగంలో పుస్తకాలూ కొనేవారు ఉన్నారా? అని మీకు సందేహం రావచ్చు. కానీ ఆఫర్ లో బుక్స్ వస్తుంటే ఎవరు మాత్రం ఎందుకు వదులుతారు. అందుకే బుక్ స్టోర్‌ ముందు క్యూ కట్టారు.

కోల్‌క‌తాలోని ఓ బుక్ స్టోర్‌లో స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా అన్ని పుస్త‌కాల మీద 50 శాతం డిస్కౌంట్‌ను అందించార‌ట‌. అందుకే.. పుస్త‌కాభిమానులు.. ఆ షాపు ముందు క్యూక‌ట్టారు. కరోనా నిబంధనలు ఉండటంతో స్టోర్‌ లోపలికి పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నారు.

మిగిలిన వారిని లోపల ఉన్నవారు బయటకు వచ్చిన తర్వాత లోపలికి పంపుతున్నారు. దీంతో బుక్ స్టోర్‌ కి వచ్చిన వారు క్యూలో నిల్చున్నారు. వీరిని ఫోటో తీసి ఓ ట్విట్ట‌ర్ యూజ‌ర్ త‌న అకౌంట్‌లో షేర్ చేశాడు. ఆ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. నెటిజ‌న్లు అయితే.. ఆ ఫోటోను చూసి అక్క‌డి ప్ర‌జ‌ల‌ను తెగ మెచ్చుకుంటున్నారు.