Human Skeleton: బిల్డింగ్ రూఫ్‌లో బయటపడ్డ అస్తిపంజరం
కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్‌కు చెందిన బిల్డింగ్‌లో అస్తిపంజరం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కొన్ని రోజులుగా వదిలేసి ఉన్న బిల్డింగ్ లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన నమోదైంది. వేర్‌హౌజ్ నిర్మాణం కోసం ఈ ప్రోపర్టీని...

Human Skeleton
Human Skeleton: కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్‌కు చెందిన బిల్డింగ్‌లో అస్తిపంజరం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కొన్ని రోజులుగా వదిలేసి ఉన్న బిల్డింగ్ లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన నమోదైంది. వేర్‌హౌజ్ నిర్మాణం కోసం ఈ ప్రోపర్టీని అద్దెకు ఇచ్చేసింది పోర్ట్ ట్రస్ట్.
ఆ స్థలాన్ని కొందరు వర్కర్లు క్లీన్ చేస్తుండగా స్కెలిటన్ బయటపడింది. దీనిపై నార్త్ పోర్ట్ పోలీస్ స్టేషన్ కు ఇన్ఫామ్ చేశారు. ఫోరెన్సిక్ శాంపుల్స్ సేకరించి ఇన్వెస్టిగేషన్స్ మొదలుపెట్టారు.
ఆచూకీ కోల్పోయిన వ్యక్తుల లిస్ట్ తీసుకుని అస్తిపంజరాన్ని పోల్చి చూస్తున్నారు. జూన్ నెలలోనే కోల్‍కతాలో బయటపడ్డ అస్తిపంజరాల్లో ఇది నాల్గోవది. 15రోజుల క్రితం దక్షిణ కోల్‌కతా బన్సాడ్రోనీ ఏరియాలోని ఓ కొలనులో మరో అస్తిపంజరం దొరికింది. రోజుల వ్యవధిలోనే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కుటుంబాన్ని కనుగొన్నారు.