Illegal Affair : అమానుషం.. వివాహేతర సంబంధం నెపంతో స్తంభానికి కట్టేసి కొట్టారు

వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఓ మహిళను మరో యువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి మూడు రోజులపాటు ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేశారు.

Illegal Affair : అమానుషం.. వివాహేతర సంబంధం నెపంతో స్తంభానికి కట్టేసి కొట్టారు

Illegal Affair

Updated On : November 28, 2021 / 8:23 AM IST

Illegal Affair : కర్ణాటకలోని మైసూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఓ మహిళను మరో యువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి మూడు రోజులపాటు ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేశారు. కౌలంద పోలీసుల వివరాల మేరకు.. నంజనగూడ తాలూకాకు చెందిన వివాహితపై కూలి పనులకు వెళ్తున్న సమయంలో విష్ణు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

చదవండి : Illegal Affair : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. మూడు రోజుల క్రితం వివాహిత ఒక్కరే ఉన్న సమయంలో విష్ణు ఇంట్లోకి వచ్చాడు. అతడు ఇంట్లోకి రావడాన్ని గమనించిన సదరు మహిళ భర్త.. తలుపులు బిగించి గ్రామస్తులను పిలిచి.. వారి సహాయంతో ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు. అనంతరం కరెంట్ స్తంభానికి కట్టేసింది చితకబాదాడు. మూడు రోజులపాటు ఆహారం, నీళ్లు ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేశారు.

చదవండి : Illegal Affair : తనకంటే పదేళ్ల చిన్నవాడితో ప్రేమ..సహజీవనం… చివరికి…!

ఈ ఘటనను అక్కడ ఉన్నవారు వీడియో తీసి సామజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. మహిళ భర్తను అదుపులోకి తీసుకోగా.. ఆమె మరిది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.