Husband Master Plan : భార్య నుంచి పారిపోవడానికి భర్త మాస్టర్‌ ప్లాన్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచన ప్రకారం కరోనా సోకిన వ్యక్తి 14 రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి. ఈ సమాయంలో వారిని ఎవరు కలవకూడదు. కలిస్తే వారికి కూడా కరోనా సోకే అవకాశం ఉంటుంది.

Husband Master Plan : భార్య నుంచి పారిపోవడానికి భర్త మాస్టర్‌ ప్లాన్‌

Husband Master Plan

Updated On : July 5, 2021 / 8:37 PM IST

Husband Master Plan :  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచన ప్రకారం కరోనా సోకిన వ్యక్తి 14 రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి. ఈ సమాయంలో వారిని ఎవరు కలవకూడదు. కలిస్తే వారికి కూడా కరోనా సోకే అవకాశం ఉంటుంది. అయితే ఈ నిబంధనలను కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి నుంచి పనిచేసేందుకు ఫేక్ కరోనా రిపోర్టులు పెట్టి మోసం చేస్తున్నారు. అంతే కాదు ఇంట్లో వారిని కూడా మోసం చేస్తున్నారు.

కాగా ఇటువంటి ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ లోని మోవ్ అనే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువకుడికి ఫిబ్రవరి నెలలో పెళ్లి జరిగింది. అతడికి అత్తింటి వారితో విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ ప్రైవేట్ కరోనా టెస్టింగ్ ల్యాబ్ నుంచి కరోనా పాజిటివ్ వ్యక్తి రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్నాడు. దానిని ఎడిట్ చేసి తన పేరు జతచేసి భార్య, అతడి తల్లిదండ్రులకు పంపాడు.

ఇన్ని రోజులు తమతో ఉండి.. ఎటువంటి లక్షణాలు లేకుండా కరోనా ఎలా సోకిందని సదరు వ్యక్తిని ప్రశ్నించారు కుటుంబ సభ్యులు. అయితే అతడు దాటవేస్తూ తనకు పాజిటివ్ వచ్చిందని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కుమారుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో అతడి తల్లి టెస్ట్ రిపోర్ట్ పై ఉన్న ల్యాబ్ పేరు చూసి అక్కడికి వెళ్లి విచారించింది. అయితే ఆ పేరుగల వ్యక్తులు తమ వద్ద టెస్ట్ చేయించుకోలేదని చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చి ఫోన్ లో కొడుకుని నిలదీసింది.. దీంతో అసలు విషయం ఒప్పుకున్నాడు.

భార్య ఆమె కుటుంబ సభ్యులు పెట్టె టార్చర్ భరించలేక తప్పించుకునేందుకు ఇలా చేశానని తెలిపాడు. ఇక ఇదిలా ఉంటే తమ ల్యాప్ పేరును దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ సదరు ల్యాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గ్వల్టోలి పోలీసులు నిందితునిపై పలు సెక్షన్‌ల కింద కేసులను నమోదుచేశారు. పోలీసుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.