పెళ్లాం చెబితే వినాలి : టీవీ ఛానల్ విషయంలో గొడవ.. భార్యపై హత్యాయత్నం

పెళ్లాం చెబితే వినాలి : టీవీ ఛానల్ విషయంలో గొడవ.. భార్యపై హత్యాయత్నం

పిల్లలకు కార్టూన్స్.. ఆడాళ్లకు టీవీ సీరియల్స్.. మగాళ్లకు న్యూస్ ఇది అనాథిగా వస్తోన్న ట్రెండ్.. మధ్యలో ఎవరైనా కెలికారంటే ఫసక్కే.. ఎంతటి అఘాయిత్యం చేయడానికైనా సిద్ధపడిపోతారు. అంతలా పెరిగిపోయింది టీవీలపై మమకారం. తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉంటున్న అయోతీ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఉషా (47), వీరన్‌లు భార్యాభర్తలు కలిసి టీవీ చూస్తున్నారు. భర్త చూస్తున్న కార్యక్రమం నచ్చలేదు. టీవీ ఛానెల్ మార్చమని చెప్పింది. దానికి మార్చేది లేదంటూ మొండికేశాడు భర్త. మాటామాట పెరిగి వాదన వేడెక్కింది. మంచం పై నుంచి కిందకు తోసేశాడు. దగ్గర్లో ఉన్న టేబుల్‌కు తగలడంతో తీవ్రంగా గాయానికి గురైంది. 

ఇంత క్రూరంగా ప్రవర్తించినందుకు భర్తను మందలింపుగా నోరు జారింది. అప్పటికే ఆగ్రహం మీద ఉన్న వీరన్.. వంటగదిలో ఉన్న కత్తి తీసుకొచ్చి.. ఛాతిపై, కడుపులో, మెడపై పొడిచాడు. భర్త క్రూరత్వానికి కాపాడమని హాహాకారాలు పెడుతున్న ఉషను స్థానికులు కాపాడారు. విషయం పోలీసులకు తెలియజేశారు. రోయపెట్టా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై అత్యాయత్నం పేరిట కేసు నమోదు చేశారు.