Gaganyaan Astronauts : అంతరిక్షంలోకి హైదరాబాద్ ఫుడ్.. వ్యోమగాములకోసం ఎన్ఐఎన్ ప్రత్యేక ఆహారం తయారీ..
Gaganyaan Astronauts : అంతరిక్షంలో పరిస్థితులకు తగినట్టుగా ఆహార పదార్థాలను తయారు చేయబోతున్నారు. అందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌లో భాగమైన హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సైంటిస్టులు వ్యోమగాములు తీసుకునే ఆహారాన్ని స్టడీ చేయబోతున్నారు.
Gaganyaan Food
- గగన్‌యాన్‌కు హైదరాబాదీ ఫుడ్
- కిచిడీ, చికెన్ నగెట్స్, మటన్ రోల్స్
- ప్రత్యేక వంటకాలు తయారు చేస్తున్న ఎన్ఐఎన్ సైంటిస్టులు
- నవంబర్‌లో కోల్‌కతాలో ఆస్ట్రోనాట్లపై మైక్రోగ్రావిటీ స్థాయిలో పరీక్షలు
Gaganyaan Astronauts : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక గగన్‌యాన్ అంతరిక్ష యాత్రను చేపట్టనుంది. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రే గగన్‌యాన్. ఈ యాత్ర ద్వారా వ్యోమగాములను 400 కిలోమీటర్ల కక్ష్యలోకి పంపిస్తారు. మూడు రోజులు పాటు అక్కడే ఉంచి.. తిరిగి సురక్షితంగా భూమికి (సముద్ర జలాల్లో) తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఈ యాత్రలో పాల్గొనే వ్యోమగాములకు అవసరమైన ఆహారాన్ని హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రత్యేకంగా రూపొందిస్తోంది.
Also Read : Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. 2.5లక్షల మందికి శుభవార్త.. జూన్ 1 నుంచి ప్రక్రియ ప్రారంభం..
అంతరిక్షంలో పరిస్థితులకు తగినట్టుగా ఆహార పదార్థాలను తయారు చేయబోతున్నారు. అందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌లో భాగమైన హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సైంటిస్టులు వ్యోమగాములు తీసుకునే ఆహారాన్ని స్టడీ చేయబోతున్నారు. కిచిడీ, మటన్ రోల్స్, చికెన్ నగ్గెట్స్, పండ్ల మిశ్రమాల వరకు వైవిధ్యభరితమైన ప్రత్యేక పదార్థాలపై మరో సంస్థతో కలిసి రెండేళ్లుగా ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ ఏడాది నవంబరులో నిర్వహించనున్న 14 రోజుల భూ గురుత్వాకర్షణలేని వాతావరణ అధ్యయనంలో ఈ ఆహారాన్ని తొలుత పరీక్షించనున్నారు.
ఆస్ట్రోనాట్లు తలకిందులుగా బెడ్ రెస్ట్ పొజిషన్లో ఆహారం తీసుకుంటే ఎలాంటి రియాక్షన్లు వస్తాయో విశ్లేషించనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా టిల్టెడ్ బడ్లనూ ఇప్పటికే తయారు చేశారు. ఆ పొజిషన్లోనే రోజువారీ పనులు చేసుకుంటూనే పైకి లేవకుండానే ఫుడ్ తినడం, వాష్‌రూమ్స్ కు వెళ్లడం వంటి వాటిని సిమ్యులేషన్ ద్వారా ఆస్ట్రోనాట్లపై స్టడీ చేయనున్నారు. అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ఫుడ్ పాడైపోకుండా వాడాల్సిన ప్రిజర్వేటివ్స్‌ను ఎంతమోతాదులో కలపాలి, ఫుడ్ టేస్ట్ మారకుండా ఫ్రీజ్ డ్రైయింగ్, ఇన్ఫ్రారెడ్ డ్రైయింగ్ వంటి పద్ధతుల ద్వారా స్టడీస్ చేయనున్నారు.
భూమిమీద కంటే అంతరిక్షంలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణలో వ్యోమగాముల ఎముకలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఎముకల పటుత్వం కాపాడేందుకు తక్కువ సోడియం ఉండే ఆహారం చాలా కీలకం. దీంతో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకోసం సూక్ష్మపోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్- డీ ఎక్కువగా అందే ఫుడ్‌పైనే సైంటిస్టులు దృష్టి పెడుతున్నారు.సూక్ష్మ గురుత్వాకర్షణ కారణంగా ఆహారపు ముక్కలు, ద్రవాలు గాలిలో తేలియాడకుండా, స్పేస్ క్రాప్ట్ పరికరాలను పాడు చేయకుండా ఉండేలా సులభంగా తినేలా పదార్థాలను సిద్ధం చేస్తున్నారు.
