Lotus Eletre E-SUV : అంబానీ, రతన్ టాటాలు కాదు దేశంలోనే ఖరీదైన ‘లోటస్’ కారు కొన్న హైదరాబాద్ మహిళ
లగ్జరీ కార్ల సంస్థ లోటస్ గ్రూపు Lotus Eletre E-SUVని దేశంలో విడుదల చేసింది. రూ.2.55 కోట్ల విలువైన ఈ కారును కొనుగోలు చేసిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా?

Lotus Eletre E-SUV
Lotus Eletre E-SUV : భారతదేశంలో ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ.. ధోనీతో సహా అనేకమంది బిలియనీర్లు, స్పోర్ట్స్ పర్సన్స్ ఖరీదైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. అయితే రూ.2.55 కోట్ల విలువైన లోటస్ ఎలట్రే SVUని ఎవరు కొనుగోలు చేశారో తెలుసా?
లగ్జరీ స్పోర్ట్స్ కార్లు, ఎలక్ట్రిక్ లైఫ్ స్టైల్ వెహికల్స్ తయారీలో ప్రసిద్ధి చెందిన లోటస్ గ్రూపు ఇండియాలో సైతం గతేడాది తమ వ్యాపారాన్ని ప్రారంభించింది. తమ Lotus Eletre E-SUVని దేశంలో విడుదల చేసింది. రూ.2.55 కోట్ల విలువైన ఈ కారును కొనుగోలు చేసిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? .. హైదరాబాద్‌కి చెందిన హర్షికా రావు. Eletre, Eletre S మరియు Eletre R అనే మూడు వేరింట్లను అందించింది కంపెనీ. కాగా హర్షికా రావు ముదురు ఎరుపు రంగును సెలక్ట్ చేసుకున్నారు. ఈ కారు ఫోటోలను కార్ క్రేజీ ఇండియా అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.
Eletre SUV ఇండియాలోనే అత్యంత ఖరీదైన SVU గా తెలుస్తోంది. కారు ఫ్రంట్ భాగాన్ని గమనిస్తే ఫెరారీలాగా అనిపిస్తుంది. ఒకే రకమైన డిజైన హెడ్ లైట్ సెటప్ చేయడం అందుకు కారణం. Eletre మరియు Eletre S 600km గరిష్ట పరిధితో 603hp డ్యూయల్-మోటార్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి. ఇది వేగవంతమైన ఛార్జర్‌ని ఉపయోగించి 20 నిమిషాల్లో 10-80 శాతం నుండి ఛార్జ్ చేయగలదు.
View this post on Instagram