గుండెల్ని పిండేసే ఘటన : అమర జవానుకు భార్య చివరి ముద్దు

  • Published By: veegamteam ,Published On : February 22, 2019 / 04:17 AM IST
గుండెల్ని పిండేసే ఘటన  : అమర జవానుకు భార్య చివరి ముద్దు

Updated On : February 22, 2019 / 4:17 AM IST

అమర జవాన్లకు సంబంధించిన ఒక్కో కథనం గుండెల్ని పిండేస్తోంది. దేశరక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే మన సైనికులు ముష్కరుల అరాచకానికి 49మంది బలైపోయారు. వారి మరణవార్త విన్న తరువాత వారి కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. హృదయాలు ద్రవించేపోయే ఆ ఘటనలు మానవత్వం ఉన్న ప్రతీవారిని కదిలించేస్తున్నాయి. 

వారు మరణవార్త తెలుసుకుని  ఉబికి వచ్చే కన్నీళ్లను పంటి బిగువనే అదిమిపెట్టి..తమ పిల్లలకు ధైర్యం చెబుతూ గుండె దిటవు చేసుకుని చివరి వీడ్కోలు పలుకారు. ఆ వీర మాతలు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన వీర జవాన్ విభూతి కుమార్ దౌండియాల్‌కు ఆయన భార్య ఇచ్చిన చివరి వీడ్కోలు అందరి హృదయాలను కలచివేస్తోంది. తన భర్తకు చివరిసారిగా ఆమె ఐ లవ్ యూ చెప్పిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 
 

పుల్వామా దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరిపారేసే క్రమంలో సోమవారం (ఫిబ్రవరి18)న  ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు మరణించారు. వారిలో మేజర్‌ విభూతి శంకర్‌ దౌండియాల్‌ ఒకరు. దౌండియాల్‌ భౌతికకాయానికి ఉత్తరాంఖండ్‌లోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. 
  

తన భర్త విభూతిని అలా చూసేసరికి భార్య నికితా గుండెలవిసేలా విలపించారు. తరువాత దు:ఖాన్ని దిగమింగుకుని అమర్ హై, జైహింద్ అంటూ ఘన నివాళి అర్పించారు. తన భర్తను ప్రేమగా.. విభూ అని పిలుచుకునే నికితా.. దౌండియాల్ భౌతికకాయం పక్కన కూర్చుని భర్తతో చివరిసారిగా ‘ఐ లవ్ యూ విభూ.. వియ్ లవ్ యూ’ అని చెప్పారు. చివరిసారిగా ముద్దు ఇచ్చారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. జైహింద్ అంటు ఘన నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతీ సైనికుడు త్యాగమూర్తులే..అటువంటి సైనికులు త్యాగాలకు సలాం..శిరస్సు వచ్చి ప్రతీ ఒక్కరూ సెల్యూట్ చేయాల్సిందే. 

#WATCH Wife of Major VS Dhoundiyal (who lost his life in an encounter in Pulwama yesterday) by his mortal remains. #Dehradun #Uttarakhand pic.twitter.com/5HWD6RXwnO

— ANI (@ANI) February 19, 2019

Read Also: సినిమా రివ్యూ : ఎన్టీఆర్ మహానాయకుడు
Read Also: ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం : సీఎం కేసీఆర్
Read Also: బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేసీఆర్