మార్చి నెలాఖరుకు I-T టార్గెట్ రూ.2లక్షల కోట్లు

ప్రధాని నరేంద్ర మోడీ ఇన్‌కమ్ ట్యాక్స్(ఐటీ) కట్టే భారతీయులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పిన రెండ్రోజుల్లోనే ఐటీ డిపార్ట్‌మెంట్ టార్గెట్ పెరిగింది. ఫైనాన్షియల్ ఇయరెండింగ్ మార్చి ముగిసేనాటికి రూ.2లక్షల కోట్లు స్వాధీనం చేసుకోవాలని ఫ్రెష్ ఆర్డర్లు వచ్చాయి. దీనికి వివాద్ సే విశ్వాస్ అనే పేరుతో 45రోజుల్లో పూర్తి చేయాలి.
నిజానికి ఈ స్కీం జూన్ 2020లో ముగియనున్నప్పటికీ మార్చి 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి. ఇక ట్యాక్స్ ఆఫీసర్లు దేశవ్యాప్తంగా ఆకస్మిక దాడులకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ట్యాక్స్ ఆఫీసర్లు కలెక్ట్ చేసిన సొమ్మును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్‌కు లింక్ చేసి టార్గెట్ ఎంతవరకూ రీచ్ అయ్యారోనని లెక్కగడతారు.
ఇది పూర్తిగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్(పీఎంఓ) ఆధ్వర్యంలో నడుస్తుంది. రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే, పీసీ మోడీ, ఛైర్మన్ ఆఫ్ సీబీడీటీలు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారు. వారానికోసారి మీటింగ్ లలో పురోగతిపై చర్చిస్తారు. వివాద్ సే విశ్వాస్ స్కీం ద్వారా పెండింగ్‌లో ఉన్న 4లక్షల 83వేల ట్యాక్స్ కేసులు పరిష్కారించాలని ముందుగానే నిర్ణయించారు.
ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వివాద్ సే విశ్వాస్ స్కీం ద్వారా చేస్తున్న వసూళ్లు రూ.1.25లక్షల కోట్లకు తగ్గాయి. దీంతో కేంద్ర బడ్జెట్ 2019-20లో ఉన్న రూ.13.35లక్షల కోట్ల టార్గెట్‌ను రూ.11.80 లక్షల కోట్లకు తగ్గించింది కేంద్రం.
Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు