Memorial For CDS Rawat : మోదీకి కూనూర్ వాసుల లేఖ..రావత్ పేరిట స్మారకం నిర్మించాలని విజ్ణప్తి
డిసెంబర్-8,2021న తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్ట్రర్ కూలిపోయిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దేశపు తొలి త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్,

Rawat5
Memorial For CDS Rawat : డిసెంబర్-8,2021న తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్ట్రర్ కూలిపోయిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దేశపు తొలి త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, మరో 12మంది పేరిట ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయాలని నీలగిరి జిల్లాలోని కూనూరు వెల్లింగ్టన్ కంటోన్మెంట్ వాసులు ప్రధాని మోదీని కోరారు. తమ విజ్ఞప్తితో కూడిన లేఖలను ప్రధాని, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు పంపారు.
హెలికాప్టర్ ప్రమాద ఘటన తమను విచారంలో ముంచెత్తిందని ఆ లేఖలో స్థానికులు పేర్కొన్నారు. తమిళనాడు రెవన్యూ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రమాదం జరిగిన ప్రాంతంలో స్మారక నిర్మాణం చేపట్టాలని, తద్వారా ప్రజలు నివాళులర్పించేందుకు వీలుంటుందని కూనూరు గ్రామస్తులు లేఖలో పేర్కొన్నారు. అలాగే కట్టేరీ పార్క్,మెట్టుపాల్యం-ఊటీ (ఉదగమండలం) లైన్‌పై ఉన్న రన్నయ్‌మేడు రైల్వే స్టేషన్ కు బిపిన్ రావత్ పేరు పెడితే చారిత్రక గుర్తింపుతో పాటు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమవుతాయని వారు విజ్ఞప్తి చేశారు.
ఇక,హెలికాఫ్టర్ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఆర్మీ గ్రూప్ కెప్టెన్ బెంగళూరు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆయన్ను బతికించేందుకు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ALSO READ PM Modi In Varanasi : వారణాశిలో గంగా హారతిని తిలకించిన మోదీ